Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
33 episode

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

.........

అతనిపేరుపీతాంబరం,

మధ్య  వయస్కుడు,  పేరుకు తగ్గట్టే తెల్లటి ఫాంటుషర్టులో కాస్త గంభీరంగాను, కాస్త హడా వుడిగాను కన్పిస్తున్నాడు. జనాభా లెక్కల సేక రణలో భాగంగా గేటు తీసుకొని ఓ డాబా ఇంటి ముందుకెళ్ళాడు.చెన్నై ఎయిర్పోర్టు కు కాస్త దూరంలో సువిశాలమైన కాలనీ ఒకటివుంది. ఆ కాలనీ పేరు గోస్వామీకాలనీ, మూడే మూడు వీధుల కాలనీ అది. ఆ కాలనీలో అన్నీ ఒకేలా ఫారెన్ స్టయిల్లో నిర్మించిన విల్లాలున్నాయి.

మూడు వరుసల్లో మొత్తం నూట ఎనభైగృహాలు, ఒక్కో వరుసలోను అరవైయిళ్ళు. యిళ్ళ ముందు రోడ్డు.  మొత్తం మూడురోడ్లు. ఆ కాలనీని చుట్టి కాంపౌండ్ వాల్  వుంది. దానికి దక్షిణభాగాన ఒకే ఎంట్రన్స్. ఇళ్ళన్నీతూర్పు ఫేసు. గేటు దాటగానే ఎవరికి వాళ్ళు అవతలికి వెళ్ళిపోవచ్చు. చాలా ఖరీదైన ఏరియా. గోస్వామి కాలనీ అంటే ఆ ప్రాంతం లో తెలీని వాళ్ళుండరు. గోస్వామిరియల్ ఏస్టేట్  అండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కట్టి అమ్మిన కాలనీ యిళ్ళవి.

అటువంటి కాలనీలోని...  ఏరియాకు వచ్చిన పీతాంబరం ‘ఎ’ వరుసలోని మొదటి రెండు ఇళ్ళు చూసుకొని మూడో ఇంటి కొచ్చాడు.  తలుపు దగ్గరగా మూసి ఉంది.

‘‘ఎవరండీ ఇంట్లో?’’  బయట చిన్న అరుగు మీద చతికిలబడుతూ పిలిచాడు. ఎవరూ పలకలేదు.

‘‘ఎవరండీ లోపల? మాట్లాడరా?’’ ఈ సారి కాస్త విసుగు ధ్వనించింది పీతాంబరం గొంతులో. అప్పుడు లోపల్నుంచి `

‘‘మీరెవరండీ?’’ అంటూ ఒక యువతి గొంతు మృధువుగా విన్పించింది.

‘‘అమ్మా నా పేరు పీతాంబరం....’’

‘‘ఏతాంబరం?’’

‘‘తాంబరం కాదు తల్లీ,  పీతాంబరం,  జనాభా లెక్కలు  సేకరించే డ్యూటీలో వచ్చాను. మీ యింట్లో ఎంతమంది వుంటున్నారు? పురుషు లెందరు , స్త్రీలెందరు, పిల్లలెందరు. మీపేర్లు, వయస్సు టకటక చెబితే రాసుకు నెళ్ళిపోతాను.’’ అంటూ పుస్తకం తెరిచాడు.

‘‘అయ్యో... మావారు ఇంట్లో లేరండీ మీరు మళ్ళీ రండీ’’ లోపల్నించి అదే గొంతు.

పీతాంబరం విసుగ్గా డోర్ వంక చూసాడు.

‘‘అదేమిటమ్మా నేనేమన్న అడుక్కునే వాడ్నా మళ్ళీమళ్ళీ రావటానికి. అయినా పేర్లు చెప్పటానికి మీ ఆయనే రావాలా? మళ్ళీ రావడం కుదరదు.  ఈ కాలనీ పూర్తిచేయడానికే ఈ రోజంతా పట్టేలా వుంది. ఓ సారిలా బయటకు రామ్మా’’ అన్నాడు.

‘‘అయ్యయ్యో. తప్పుతప్పు. పరపురుషుడి ముందుకు మేము రామండీ’’.

‘‘గొప్ప చిక్కే వచ్చిందే... పోనీ లోపల్నించే చెప్పమ్మా. విని రాసుకుని వెళ్ళిపోతాను’’.

‘‘అలాగయితే రాసుకోండి.

‘‘చెప్పమ్మా’’

‘‘నా పేరు తాటకి... మా వారి పేరు కుంభకర్ణ,  మామామగారి పేరు త్రిపురాసుర. ఇన్సియల్ టి అని రాసుకోండి.

పీతాంబరానికి ఒక్కసారిగా ` మెదడు జారి మోకాళ్ళలోకి దిగినంత పనయింది. చేతిలో పెన్ను జారిపోయింది. గబుక్కున పట్టుకుని ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ గుడ్లప్పగించి డోర్ వంక చూస్తుండిపోయాడు.

‘‘రాసుకున్నారా?’’ లోపలి యువతి అడిగింది.

‘‘ఏం రాసుకోను తల్లీ? ఇక్కడ అరచేతులు చెమటలు పడుతున్నాయి. ఏంటది... మీ మామగారు త్రిపురాసురుడా... మీ ఆయన కుంభకర్ణుడా... నీ పేరు తాటకా...  తమాషా చేయటం లేదు గదా... ఎవరన్నా రాక్షసుల పేర్లు పెట్టుకుంటారా? ఇవి అధికారిక లెక్కలు. తప్పులు దొర్లకూడదు.’’ అన్నాడు కాస్త కోపంగా.

‘‘అయ్యో మీరలా అనుకుంటున్నారా? నిజంగా మా పేర్లు అవేనండి. రాక్షస వంశంగదా. అలాగే వుంటాయి. దీనికే ఆశ్చర్యపోతున్నారు. మా పిల్లల పేర్లు వింటే మరీ ఆశ్చర్యపోతారు.’’

‘‘అలాగా... వాళ్ళపేర్లేమిటో?’’

‘‘శుంభానిశుంభులు’’

‘‘వామ్మో ఇవీ రాక్షసపేర్లే’’ అంటూ అదిరిపడి లేచి నిలబడ్డాడు పీతాంబరం.

‘‘అవునండి.... మాది రాక్షస కుటుంబమేగదా. వాళ్ళింకా ట్యూషన్ నుండి రాలేదు. వస్తే చాలా ప్రమాదం. త్వరగా రాసుకువెళ్ళిపోండి.’’ అంటూ హెచ్చరించింది లోపల్నుంచి ఆడగొంతు.

‘‘రాసుకోవాలా. ఎందుకు? నీ పిల్లలొస్తే నన్నుచీల్చుకుతినడానికా. ఇందేం కొంపరా దేవుడా!’’ అంటూ గబగబా పుస్తకం మూసి`
భయం భయంతో కంగారుగాగేటువైపుఅడుగులేశాడు. సరిగ్గా అప్పుడే ఒక బైకు గేటులోకి వచ్చింది. ఖరీదైన ఆ బైకు మీద వచ్చింది ఆరడుగుల అందమైన యువకుడు. సిక్స్పేక్లాంటిబాడీ, సుందరముఖారవిందుడు, పసిమిఛాయమేనితోమిసమిసలాడేవయసు. టక్చేసి టై కట్టుకొని చాలా అఫీషియల్ గా ఉన్నాడు. పరుగులాంటినడకతోవస్తున్నపీతాంబరాన్నిచూసిబైక్ ఆపి ‘‘ఎవరండీమీరు? అలా కంగారుగా వెళ్ళిపోతున్నారేమిటీ? ’’ అనడిగాడు.

‘‘తెలీక ఈ రాక్షసకొంప కొచ్చాను.’’

వచ్చిన యువకుడికి అర్థంకాక తెల్లబోయి చూసాడు.

‘‘రాక్షసకొంపా...  ఏమంటున్నారు మీరు?’’ అనడిగాడు.

‘‘అర్థంకాలేదా.  ఈ ఇంట్లో ఒక రాక్షస కుటుంబం ఉంటోంది. ఆవిడ పేరు తాటకి అట,  మామగారి పేరు త్రిపురాసురుడట,  మొగుడి పేరు కుంభకర్ణుడట,  వాళ్ళ పిల్లల పేర్లు శుంభానిశుంభులట.  బ్రతికుంటే బలుసాకు తినొచ్చు నాయనా. అరటిపండులా ముద్దొస్తున్నావ్. ఏం పనిమీద వచ్చావో ఏమిలో, వెళ్ళకు బాబూ. తిరిగి వెళ్ళిపో!’’ హెచ్చరించాడు పీతాంబరం. ఆ మాటలు విని  వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ`

‘‘ఆగండాగండీ!’’ అన్నాడాయువకుడు.

‘‘మీకీ సమాచారం ఎవరిచ్చారు?’’ అనడిగాడు.

‘‘ఇంకెవరు?’’ ఇంటిఇల్లాలే.

‘‘ఆవిడ్నిమీరు చూసారా?’’

‘‘అబ్బో... చూడ్డం కూడానా. రాక్షస స్త్రీ అయినా పరపురుషుడి ముందుకి రాదట. ఇంతకీ నువ్వెవరయ్యా.  ఏం పనిమీద వచ్చావో.’’

‘‘పని మీద రావటం ఏందండీ. ఈ ఇల్లు నాదే....’’

‘‘వామ్మో అంటే ఆమె భర్త కుంభకర్ణుడు నువ్వేనా...’’ అంటూ పీతాంబరం చలిజ్వరం వచ్చిన వాడిలా వణుకుతూ పారిపోబోయాడు. చటుక్కున అతని చేయిపట్టి ఆపాడు విరాట్. ‘‘భయపడకండి. మీరనుకుంటున్నట్టు ఇక్కడ రాక్షసులెవరూ లేరు. నా పేరు విరాట్. ఎగ్మోర్ లోఒక సాప్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఈ ఇంట్లో నేను నా ఫ్రెండ్ చందు ఉంటాం. అంటూ ధైర్యం చెప్పాడు.

ఆ మాటలు విన్నాక కాస్త ధైర్యం తెచ్చుకుని` తేలిగ్గా వూపిరి తీసుకున్నాడు పీతాంబరం.‘‘ఇప్పుడర్థమైందిలే నాయనా. అనవసరంగా నన్ను భయపెట్టారు.  ఇంతకీ మీ పేర్లు రాసుకోవచ్చా?’’ అనడిగాడు.

‘‘వద్దండి.’  అన్నాడు వెంటనే విరాట్

‘‘అదేమిటి?  మీరు దేశ జనాభాలో లేరా?’’

‘‘ఉన్నాం. మీ పేరేమిటి?’’

‘‘పీతాంబరం’’

‘‘చూడండి పీతాంబరం గారు. నాది కోయంబత్తురు. చందు అక్కడికి సమీపంలోని ఉసిలంపట్టి గ్రామానికి చెందినవాడు. మా పేర్లు మావూళ్ళో నమోదయ్యాయి.  మీరు మళ్ళీ ఇక్కడ నమోదు చేయక్కర్లేదు. ఇంతకీ అర్థమైందన్నారు. ఏమర్థమైందో చెప్పలేదు.’’

‘‘అదే... బ్రహ్మచారిశత మర్కట్ణ అన్నారు. ఏ చిలకనో తెచ్చి లోన పెట్టుకున్నావ్. అది కారుకూతలు కూసి నన్ను భయపెట్టింది.’’
నుదురు కొట్టుకున్నాడు విరాట్.

బైక్ దిగిస్టాండ్ వేస్తూ ‘‘నాతో రండి. మీ డౌట్ క్లియర్ చేస్తాను.’’ అన్నాడు. ఇద్దరూ డోర్ ముందుకెళ్ళారు. విరాట్ తలుపుతట్టి ‘‘అరేయ్ చందూ!’’ అంటూ పిలిచాడు. మరుక్షణం ‘‘ఆఁ... వస్తున్నా!’’ అంటూ లోపల్నుంచి మగ గొంతు విన్పించిది. క్షణం తర్వాత డోర్ తెరుచుకుని డోర్లో ఒక యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఛామనచాయరంగులో పొడవుగా హుషారుగా ఉన్నాడు.  అతను విరాట్ పక్క నుండి కళ్ళప్పగించి చూస్తున్న పీతాంబరాన్నిచూసి` ‘‘హలో పీతాంబరంగారూ. మీరింకా వెళ్ళలేదా?’’ అంటూ అమ్మాయిలా మెలితిరుగుతూ గొంతు మార్చి అడిగాడు. ఇంతకు ముందు తను విన్న అదే గొంతు.

పీతాంబరాని కి కళ్ళు గిర్రున తిరిగి కిందపడబోయి నిలదొక్కుకున్నాడు. విరాట్ నవ్వుతూ` ‘‘చూసారా. లోన అమ్మాయిలెవరూ లేరు. మా వాడు మిమిక్రి ఆర్టిస్టు. రకరకాలుగా గొంతుమార్చిజనాన్నిభయపెడుతుంటాడు. సారీ. ఏమీ అనుకోకండి.’’ అన్నాడు జరిగినదానికి నొచ్చు కుంటూ .‘‘నొచ్చుకోడానికి ఏముంది నాయనా. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. నీ ఫ్రెండు గొప్ప మిమిక్రీ ఆర్టిస్టే గావచ్చు. ఇలాంటి జిమ్మిక్కు  స్టేజీషోలకు బాగుంటాయిగాని ప్రాక్టికల్ జోక్ కిబాగోవు.’’ అంటూ వెను తిరిగి వీధిలోకెళ్ళిపోయాడు.

విరాట్  కోపంతో చందూ కోసం చూసాడు. అతనింకా అక్కడెందుకుంటాడు. అంతకు ముందే లోనకు పారిపోయాడు.

‘ఒరేయ్  విరాట్!  కాస్త నెమ్మదిరా బాబూ. చెన్నై మారథాన్  పోటీలో పాల్గొన్నట్టు ఆ నడకేమిట్రా. నా వల్ల కావటం లేదు.’’ విరాట్ వెనకే పడుతూ లేస్తూ ఆనుసరిస్తూ అరిచాడు చందు.

అది సాయంకాలం సమయం. ఎగ్మోర్ సమీపంలోఉన్నారు.ఆ ప్రాంతమంతా ఒకే జన సందోహంగావుంది. సమీపంలోనే ఎగ్మోర్ రైల్వే స్టేషనుంది. ఆఫీసులు వదిలే టైం కాబట్టి సిటీ రైళ్ళ కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు జనం.

చందూ మాటలు విన్నా పట్టించుకోలేదు విరాట్. నడక వేగం తగ్గించలేదు. ‘‘నిన్నేరా. వినబడుతోందా? కాస్త స్లోగా నడు.’’ మళ్ళీ హెచ్చరించాడు చందు.

‘‘నంధింగ్ డూయింగ్. నడవాల్సిందే. ఏం? మీ వూరి పొలంగట్ల మీద పరుగెత్తి నోడివి సిటీలో నడవ లేవా?’’ నడుస్తూనే ఎద్దేవా చేసాడు విరాట్.

‘‘ఈ జనారణ్యం కన్నా పొలంగట్లే ఎంతో నయం. నీకేం తెలుసు ఉళ్ళో చిరుతపులిలా తిరిగినోడ్ని. పిల్లిని చేసి తెచ్చి ఈ కాంక్రీట్  జంగిల్లో పడేసావ్. ఇది  జనమా చీమల పుట్టా. తప్పించుకు నడవలేక ఛస్తున్నాను.’’

‘‘అవున్లే.  ఫ్రెండువని తెచ్చి మా ఆఫీసులోనే ఉద్యోగం వేయించి నిన్ను నాతో ఉంచుకున్నాను చూడు నాదే తప్పు’’.

‘‘ఊరకే వుంచావా. వంట వాడ్ని చేసి మరీ ఉంచుకున్నావ్గా’’

‘‘అంత కష్టమైతే ఊరెళ్ళిపో!’’

‘‘ఇలా నడిపిస్తే అలానే చేస్తాను. బంగారం లాంటి ఫారెన్  బైక్కి ఏ రోగం వచ్చిందో ఏమిటో ఉదయం ఆఫీసు కొస్తుండగా పుటుక్కున ఆగి పోయింది.  దాన్ని మెకానిక్  షెడ్డు వరకుతోయించావ్.  మెకానిక్  చూస్తే రిపేరుకు వారం పడుతుందన్నాడు. ఇపుడు ఆటోలో కొంప చేరుకోవచ్చనుకుంటే పిసినారి పుల్లారావు...’’

‘‘వాడెవడు?’’

‘‘ఉన్నాడులే నీలాంటి వాడే. ఆటో డబ్బులు కలిసొస్తాయని సిటీ రైలుకి పరుగులు తీయిస్తున్నావు. నువ్వుబాగుపడవు’’

చందు మాటలకి ఆగి తిరిగి చూసాడు విరాట్. నాలుగు అడుగుల వెనకే వస్తున్న చందూ కూడా ఆగాడు.

‘‘ఏరా ఎగ్మోర్  ఏర్ పోర్ట్  పక్కనే ఉందనుకున్నావా? చెరో ఆర్రూపాయలతో వెళ్ళిపోయేదానికి మూడొందల రూపాయలు ఆటోకిచ్చుకోవాలా పద త్వరగా.’’ అన్నాడు.

‘‘అంతేగాని నువ్వు స్లోగా నడవనంటావ్’’ అన్నాడు సీరియస్ గాచందు. తిరిగి అదే వేగంతో నడవనారంభించాడు విరాట్. అతడి నడక వేగానికి బ్రేక్ వేయాలనిపించింది చందూకి. చాలా క్లోజ్ గా అతడి వెనకే వస్తూ ఎదురుగాచూసాడు.

జన సమర్థంలో ఎదురుగా,  పాతికేళ్ళ పరువాల బొమ్మ ఒకటి టైట్ ప్యాంటు టి షర్టులో రంగులరాట్నంలా తిప్పుకొంటూ వచ్చేస్తోంది. దగ్గరకు రాగానే ఆమె తమ పక్కన్నుంచి పోతుండగా చేయి చాపి పాంటుకి షర్టుకి మధ్య ఇసకతిన్నె లావున్న వంపు మీద చేయివేసి అదిమి, ఎంత వేగంగా అది మాడో అంతే వేగంగా పక్కకు తప్పుకున్నాడు. ఆమె కూడా అంతకన్నా వేగంతో రియాక్టవుతూ చేయి పట్టుకుని వెనుతిరిగింది.  కాని ఆమె పట్టుకుంది విరాట్ చేతిని. చందూ స్ప్రింగ్లా తన చేతిని వెనక్కి తీపుకోగానే విరాట్ని దాటి ముందు కెళ్ళిపోయాడు.మెత్తని  చేయి ఒకటి తన చేతిని పట్టుకోగానే ఉలికిపడుతూ ఆగి తిరిగి చూసాడు విరాట్. కోపంతో నిప్పు లాగుప్పుమన్న ఆమె ముఖారవిందం విరాట్ ముఖాన్ని చూడగానే చప్పున చల్లారిపోయింది. అందంగా నవ్వుతో ‘హాయ్ హేండ్సమ్’ అంటూ పలకరించింది ముఖం నిండా  నవ్వు పులుము కుంటూ.

విరాట్ కే మీఅర్థంగాక

ఆశ్చర్యంతో చూసాడు.

‘‘అయాం విశాల’’ తనే చెప్పింది తిరిగి.

‘‘అయాం విరాట్’’ సోవాట్?’’ నొసలువిరిచాడు....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్