Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 18 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

 ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు అనుకున్న ఫలితాలు ఇస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబంలో ఆశించిన విధంగా మార్పులు రావడం వలన కొంత సంతోషాన్ని పొందుతారు. సంతానపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి లేదా కొంతకాలంగా పెండింగ్లో ఉన్న విదేశీప్రయాణాలు అనుకూలించే అవకాశం కలదు. ప్రమాదాలు జరుగుటకు అవకాశం ఉంది కావున వాహనముల విషయంలో అలాగే ప్రమాదకరమైన వస్తువులతో పనిచేసే టప్పుడు జాగ్రత్తలు పాటించుట మంచిది.

 

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం మేలు తొందరపాటు నిర్ణయాలు వద్దు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డ వాటిని చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. సోదరవర్గం నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు వారితో చర్చల్లో పాల్గొనే అవకాశం కలదు. కుటుంబసభ్యులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు సర్దుబాటు మేలుచేస్తుంది నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది ఆశించిన విధంగా లబ్దిని పొందుతారు. బంధువులనుండి సమాచరం సేకరిస్తారు. 

మిథున రాశి

ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. అధికారులతో కలిసి చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావడం ఊరటను ఇస్తుంది. వ్యాపరపరమైన విషయాల్లో అనుకున్న మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో చేయుచర్చల మూలాన కొన్ని నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. స్వల్పమానసిక సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు అవసరం.నచ్చిన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. దైవసంభందమైన విషయలకు సమయం ఇస్తారు.

 

 

కర్కాటక రాశి

......ఈవారం మొత్తంమీద ఆశించిన విధంగా పనులు ముందుకు వెళ్ళడం మూలాన సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దలను కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు ఈ విషయంలో బాగాఆలోచించి ముందుకువెళ్ళుట మంచిది. మాటలను పొదుపుగా వాడుట సూచన వివాదములకు దూరంగా ఉండుట సూచన. స్త్రీ సంభందమైన విషయల మూలాన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మిత్రులను కలుస్తారు వారితో విందులలో పాల్గొంటారు.   

 

 

సింహ రాశి

ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయునపుడు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి నూతనప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సమయానికి భోజనం చేయుట మంచిది అనారోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబసభ్యుల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది.          

 

 

కన్యా రాశి
......

ఈవారం మొత్తంమీద చేపట్టు ప్రతిపనివిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులను మొదట్లో విజయవంతంగా పూర్తిచేస్తారు కాకపోతే ఆతర్వాత స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. మాటతీరుమూలాన నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. అధికారుల నుండి పనిభారం తప్పక పోవచ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు అరంభించుటకు అవకాశం ఉంది అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసకుంటారు. విదేశీప్రయత్నాలు చేయుట ఉత్తమం.          

 

తులా రాశి
.......ఈవారం మొత్తంమీద ఆరంభంలో నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు తోటివారికి ఉపయోగపడేవిగా ఉండే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టునపుడు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. మాటతీరు మూలాన విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో నిదానంగా వ్యవహరించుట మూలాన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. సమయానికి భోజనం చేయుట మంచిది అలాగే లక్ష్యంను ఏర్పరుచుకొని ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. విందులు,వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది.           

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన విధంగా తోడ్పాటు అందుతుంది చివరినిమిశంలో ధనం సర్దుబాటు అవుతుంది. ఉద్యోగంలో స్వల్ప పనిఒత్తిడి పెరుగుతుంది కాకపోతే అనుకున్న పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. దూరప్రదేశం నుండి వినే వార్తల మూలాన కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. నలుగురిలో పనిచేసే సమయంలో అందరి సూచనలు పరిగణలోకి తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.            

 

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో చిన్న తడబాటు ఉన్న రాను రాను పనులను తేలికగా పూర్తిచేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన వీలయితే ప్రయాణాలు వేయుట మంచిది. మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఊహించని ఖర్చుల మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. కుటుంబంలో పెద్దలతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో నూతన అవకశాలు పొందుటకు అవకాశం కలదు వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. విందులలో పాల్గొనేఅవకాశం కలదు చిననాటి మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు.   

 

 

మకర రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను వారంచివరలో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. పెద్దలను కలుస్తారు వారితో కలిసి చేపట్టిన పనుల మూలాన మంచి గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశాల నుండి ఆశించిన విధంగా ఫలితాలు రావడం మూలాన సంతృప్తిని పొందుటకు  అవకాశం కలదు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేయకండి వీలైతే వాయిదావేయుట మంచిది. ఒకవార్త మిమ్మల్ని నిరుత్సాహంకు గురిచేసే అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట మూలాన మేలుజరుగుతుంది.   

 

 

కుంభ రాశి

......ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దలతో చర్చల్లో పాల్గొంటారు వారినుండి నూతన విషయాలు తెలుస్కోనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది వాటివిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేసినపుడు నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు సమయాన్ని సరదాగా గడుపుటకు ఆసక్తిని కలిగి ఉంటారు.        

 

 

మీన రాశి
ఈవారం మొత్తంమీద  మాటలను ఆచితూచి వాడుట అనేది సూచన. నూతన పనుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయిన పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది వాహనముల మూలాన అనుకోని ఖర్చులు రావడానికి ఆస్కారం కలదు జాగ్రత్త. గతంలో చేపట్టిన పనులకు గాను ఫలితాలు సంతృప్తికరంగా ఉండే అవకాశం కలదు. బంధువులతో సంతానపరమైన విషయంలో మంచి గుర్తింపును పొందుతారు సంతానం విషయంలో నూతన  నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి పనిభారం పొందుతారు నలుగురిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులు చక్కబడుతాయి. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu