Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : పవర్‌

Movie Review - Power

చిత్రం: పవర్‌
తారాగణం: రవితేజ, హన్సిక, రెజినా, ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, కోట, సంపత్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అజయ్‌, సప్తగిరి, ప్రకాష్‌రాజ్‌, జీవా తదితరులు
చాయాగ్రహణం: జయనన్‌ విన్సంట్‌, అర్థర్‌ విల్సన్‌
సంగీతం: ఎస్‌ ఎస్‌ తమన్‌
నిర్మాణం: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం: కె.ఎస్‌. రవీంద్ర
నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేష్‌
విడుదల తేదీ: 12 సెప్టెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
కోల్‌కతాలో ఓ అవినీతి అధికారి ఏసీపీ బల్‌దేవ్‌ సహాయ్‌ (రవితేజ), క్రిమినల్‌ గంగూలీ (సంపత్‌)ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాల్ని కోల్పోతాడు. బల్‌దేవ్‌ పోలికలతోనే వున్న తిరుపతిని, బల్‌దేవ్‌ ప్లేస్‌లోకి తీసుకువస్తాడు హోంమంత్రి జయవర్ధన్‌ (ముఖేష్‌ రుషి). తిరుపతికి కూడా పోలీస్‌ అవ్వాలన్న డ్రీమ్‌ వుంటుంది. జయవర్ధన్‌, బల్‌దేవ్‌లా తిరుపతిని మలచుతాడా? బలదేవ్‌లా మారితే తిరుపతి సిన్సియర్‌ పోలీస్‌ అవ్వాలన్న తన కోరికకు తగ్గట్టుగానే వ్యవహరిస్తాడా? అన్నవి తెరపై చూస్తేనే తెలుస్తాయి.

మొత్తంగా చెప్పాలంటే :
రవితేజ ఇదివరకు దాదాపు ఇలాంటి కథే చేశాడు. అదే ‘విక్రమార్కుడు’. దాంతో ఈ సినిమాలో అతనికి ఇంకా తేలికైపోయింది. ఎనర్జిటిక్‌ హీరో రవితేజకి అల్లరి చిల్లరగా తిరిగే పాత్ర, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలూ రెండూ కొట్టిన పిండే. ఇదివరకటితో పోల్చితే ఇంకా స్టైల్‌గా కన్పించాడు రవితేజ ఈ సినిమాలో.
హీరోయిన్లలో హన్సిక, రెజినా ఇద్దరూ గ్లామరస్‌గా కన్పించారు. గ్లామర్‌ విషయంలో ఇద్దరికీ సమానంగానే మార్కులు పడతాయి. అప్పుడప్పుడూ కన్పిస్తోన్న హన్సిక ఎవరితో చేసినా తన ఉనికిని చాటుకుంటోంది. సినిమాకి కొత్త గ్లామర్‌ తీసుకొస్తోంది. ఈ సినిమాలోనూ అంతే. హీరోయిన్లకు కథలో తక్కువ ప్రాధాన్యతే దక్కినా హన్సిక, రెజినా నటన పరంగానూ ఓకే అనిపించారు. ముఖేష్‌ రుషి, సంపత్‌ మామూలే. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సప్తగిరి సినిమాకి కావాల్సిన కామెడీని పండించారు. మిగతా పాత్రధారులంతా సినిమా గమనంలో తమకిచ్చిన పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

తమన్‌ సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. అన్ని పాటలూ బాగానే వున్నా, అందులో మూడు పాటలు తెరపై చూడ్డానికీ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా చూసినప్పుడు ఎడిటింగ్‌ క్రిస్ప్‌గానే వున్నా, ఇంకాస్త క్రిస్ప్‌గా వుంటే బాగుండేదని కొన్ని సన్నివేశాలు అన్పిస్తాయి. కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రిచ్‌ ప్రెజెంటేషన్‌ సినిమాటోగ్రఫీతో లభించింది.

నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడ్డట్టు అనిపించదు. సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. యావరేజ్‌ స్క్రిప్ట్‌, కొత్తదనం లేని కథ అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ని యాక్షన్‌తో మిక్స్‌ చేసి, సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతుంది. సెకెండాఫ్‌లో యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుంది. సినిమాలో ట్విస్ట్‌లూ ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా సినిమా బి, సి సెంటర్స్‌లో వసూళ్ళు బాగా రాబట్టే అవకాశం వుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘ఎ’ క్లాస్‌ ఆడియన్స్‌ని రంజింపజేస్తే, సినిమా అన్ని సెంటర్స్‌లోనూ మంచి మార్కులు వేయించుకున్నట్టే.

ఒక్క మాటలో చెప్పాలంటే : ‘పవర్‌’ చూపించాడుగానీ... పూర్తిగా కాదు

అంకెల్లో చెప్పాలంటే : 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka