Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 25 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

 ఈ వారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారితో సమయం గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో ఊహించని సంగటనలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్పఆరోగ్యసమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో సభ్యులనుండి చేపట్టిన ఆలోచనలు ఒక అడుగు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. స్త్రీ సంభందమైన విషయాల వలన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. సొంత ఆలోచనల మూలాన మాట పడవలసి రావోచ్చును.

 

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద తీసుకొనే ఆలోచనల విషయంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది . ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది అనుకోని ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట వలన పనులు ముందుకు సాగుతాయి. జీవితభాగస్వామి మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును,కుటుంబంలో సభ్యుల మూలాన చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం కలిగి ఉండుట అనేది సూచన. నచ్చినవ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వారిద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు . ప్రయాణాలు చేయునపుడు వాటిమూలన అలసిపోయే అవకాశం ఉంది వాటిని వాయిదా వేయుట మంచిది. ఒకవార్త మిమ్మల్ని కొంత నిరుత్సాహానికి గురిచేసే అవకాశం కలదు మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం నుండి వార్తలు వినే అవకాశం ఉంది

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద ఎదుటివారిని ఇబ్బందికి గురిచేసే నిర్ణయాలు తీసుకోకండి అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను కాస్త అటుఇటుగా పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలతో చేసిన ఆలోచనలు బెడిసికొట్టే అవకాశం ఉంది కావున నిదానం అవసరం. భాద్యతలు మరవకండి ఇచ్చిన మాటను నిలుపుకొనే ప్రయత్నం చేయుట వలన మంచి పేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చును. మిత్రులనుండి నూతన సమాచరం సేకరిస్తారు వారితో కలిసి చర్చలలో పాల్గొనే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది కాకపోతే వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం అనుభవజ్ఞుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం సూచన . శుభకార్యముల విషయంలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సోదరవర్గం నుండి ఊహించని విధంగా ఖర్చులు కలుగుతాయి ఎ విషయంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరి

 

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద గతంలో చేపట్టిన పనులకు గాను మంచి పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు ఉన్నను ధనముకూడా సమయానికి సర్దుబాటు అవుతుంది. స్త్రీ/ పురుష  మూలక సౌఖ్యంను పొందుతారు వారినుండి ఆశించిన సహాయం అందుతుంది . ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనే అవకాశం ఉంది వారితో కలిసి స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మాటపట్టింపులకు పోకండి అనవసరమైన సమస్యలను మీ విధానం మూలాన తెచ్చుకొనే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రమాదకరమైన వస్తువులతో కలిసి పనిచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. దైవసంభందమైన  విషయాలకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి కావున గట్టిగా ప్రయత్నం చేయుటమంచిది. మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

 

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద ధనమునకు సంబంధించిన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో సమయపాలన మేలుచేస్తుంది. తలపెటిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది కావున ప్రణాళికా బద్దంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఖర్చుల విషయంలో మాత్రం అదుపు అవసరం లేకపోతే కొంతనస్ట పోయేఅవకాశం ఉంది జాగ్రత్త. నూతన పరిచయాలు కలుగుతాయి వారిమూలన సంతోశంను పొందుతారు కాకపోతే హద్దులు లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. సంతానం వలన నూతన విషయాలు తెలుసుకుంటారు వారితో కలిసి సమయం గడపాలనే కోరిక మరింత బలపడే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులనుండి సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణాలు స్వల్పకాలం వాయిదా వేయుట అనేది సూచన లేకపోతే ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.  

 

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది నూతన ప్రయత్నాలకు సమయం ఇచ్చే ఆస్కారం కలదు. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు శ్రమను కలిగి ఉన్నను అధికారులనుండి మంచి గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. గతకొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న పనులలో పూర్తిస్థాయి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. దూరప్రదేశాలకు చేసే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు తప్పక పోవచ్చును కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. విలువైనవస్తువులను కొనుగోలుచేసే విషయంలో మాత్రం నిదానం తప్పదు తొందరపాటు నిర్ణయాలు వద్దు పెద్దల సూచనలు తీసుకోండి మంచిది. వ్యాపారంలో బాగానే ఉంటుంది కాకపోతే సొంత నిర్ణయాలు మాత్రం ఊహించని ఖర్చులను కలుగజేయుటకు అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త తప్పదు.     

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కావున భాద్యతగా వ్యవహరిస్తే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. స్వల్ప ఆరోగ్యపరమైన ఇబ్బందులు పొందుతారు సమయానికి భోజనం చేయుట మంచిది. బంధుమిత్రులతో సమయం గడుపుటకు అవకాశం ఉంది వారి నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటలో మాత్రం శ్రమతప్పకపోవచ్చును. మే యొక్క మాటతీరు మార్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది లేకపోతే నూతన సమస్యలను తెచ్చుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయకండి వీలైతే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. ప్రణాలికలను ఏర్పరుచుకొని ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేయుట మంచిది బద్ధకం వీడడం అనేది సూచన. మిత్రులను కలుస్తారు వారితో సమయం గడుపుతారు.     

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనుల మూలాన నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అలాగే పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో అభివృద్దిని పొందుతారు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో సంతోషం కలిగి ఉంటారు,అధికారులతో కలిసి భాద్యతలను పంచుకొనే అవకాశం ఉంది. గతకొంత కాలంగా ఊరిస్తున్న అలాగే ఇష్టపడుతున్న విషయంలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం ఆశించిన విధంగా ఉండకపోవచ్చును సర్దుబాటు తప్పదు. వాహనముల విషయంలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది తప్పదు. దూరప్రదేశం ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటి మూలాన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించి వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో స్బహ్యులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు వారి సహాయసహకారాలు లభించే అవకాశం ఉంది.   

 

 

 

ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధువులను కలుస్తారు వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు వారి సూచనల మేర నడుచుకోవడం వలన వారి నుండి గుర్తింపు లభిస్తుంది . దూరప్రదేశం నుండి నచ్చిన వార్తలను వినే అవకాశం కలదు. తండ్రితరుపు బందువులకు ధనంను ఖర్చు పెట్టుటకు అవకాశం కలదు. సమయాన్ని సరదాగా గడుపుటకు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యంవిషయంలో అజాగ్రత్త వద్దు తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. పెద్దల సూచనలు నచ్చకపోయినను ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది.   

 

 

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది కావున ఎ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తెసుకోవ్డం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఊహించని ఖర్చులను పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవడం మంచిది. అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన నష్టాన్ని కొంత తగ్గించుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో శ్రమతప్పకపోవచ్చును తోటిఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట వలన ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం కలదు. కుటుంబంలో సభ్యులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది కాకపోతే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నచ్చినవ్యక్తులను కలిసే అవకాశం కలదు వారినుండి నూతన సమాచరం సేకరించే అవకాశం కలదు. స్త్రీ సంభందమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి

 

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు రావడం చేత సంతోషాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా ఉండే అవకాశం ఉంది అందరిని ఒకసారి సంప్రదించుట వలన మేలుజరుగుతుంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి గతకొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్నా ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన నలుగురిలో చక్కటి గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది అలాగే వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. మాటతీరు విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట అనేది మంచిది. వ్యాపారపరమైన విషయల్లో ఓపికను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది.   

 

 

మీన రాశి

ఈ వారం మొత్తంమీద  ఉద్యోగంలో పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అధికారుల నుండి ఆశించిన విధంగా సహకారం అందకపోవచ్చును కావున నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో పెద్దలనుండి వచ్చు సూచనల విషయంలో మరొక సరి ఆలోచనచేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో స్పష్టమైన ఆలోచన చేయుట వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. సొంతనిర్ణయాలు తీసుకొనేముందు అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం అనేది మంచిది. ఒకవార్త మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయకండి వాయిదా వేయుట మంచిది. నలుగురిలో గుర్తింపు కోసంమీరు చేసిన ప్రయత్నాలు చివరలో ఆశించిన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది.   

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu