Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri siima kaburlu

ఈ సంచికలో >> సినిమా >>

కరెంట్‌ తీగలో మెరుపు తీగ

current

హిందీలో నటిగా వెలుగుతున్న సన్నీలియోన్‌ తెలుగులో ‘కరెంటు తీగ’ ద్వారా తళుక్కున మెరవనుంది. ఈ సినిమాలో మంచు మనోజ్‌ హీరో. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయినప్పటికీ, మెరుపు తీగ సన్నీలియోన్‌ గురించే మాట్లాడుకుంటున్నారంతా. సన్నీలియోన్‌ పాత్ర ఏమిటి? ఆమె ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కాగలదా? అన్న చర్చే జరుగుతోంది. అయితే సన్నీలియోన్‌ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయడం ద్వారా సినిమాకి క్రేజ్‌ తెచ్చింది.

మంచు ఫ్యామిలీ సన్నీలియోన్‌ గురించి చాలా మంచిగా మాట్లాడుతోంది. ‘ఆమెను వేరే కోణంలో చూడరాదు’ అనడమే కాకుండా, ఆమెను సత్కరించింది కూడా. ఇది చాలా గొప్ప విషయమని సన్నీలియోన్‌ బాలీవుడ్‌లోనూ తనకు జరిగిన సన్మానం గురించి చెప్పుకుంటోంది. సినిమా ప్రమోషన్‌ కోసం సన్నీలియోన్‌ వస్తే, ఆమె నోట నాలుగు తెలుగు ముక్కలు కూడా రావొచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
allu arjun