Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allu arjun

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌ స్టార్‌కి కోపం తెప్పించారు

super star angryed

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చాలా సౌమ్యుడు. ఏ విషయంలోనూ ఆయన ఆవేశపడే రకం కాదని అతని గురించి బాగా తెలిసినవారు చెప్పడం మామూలే. కానీ ఆయనకీ కోపం వచ్చింది. ఎందుకంటే తనకు చెప్పకుండా తన పేరుతో కామెడీ సెటైరికల్‌ సినిమాని హిందీలో నిర్మించడం. హిందీలో ‘మై హూ రజనీకాంత్‌’ అనే సినిమా నిర్మాణంలో ఉంది. విడుదలకు సిద్ధమవుతోంది ఆ సినిమా.నా పేరు పెట్టారు, నన్ను కించపర్చేలాగానో నా ఇమేజ్‌ తగ్గించేలాగానో ఆ సినిమా ఉండదు కదా? అని రజనీకాంత్‌ అనుమానం వ్యక్తం చేస్తూ, ‘మై హూ రజనీకాంత్‌’ సినిమా వారికి తన అనుమానం తెలియజేస్తే వారు స్పందించలేదట. చేసేది లేక సన్నిహితుల సూచనతో చెన్నై హైకోర్టులో ఆ సినిమా విడుదలకు బ్రేక్‌ వేయాలని రజనీకాంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పుడు గగ్గోలు పెట్టారు ‘మై హూ రజనీకాంత్‌’ సినిమాకి చెందిన వారు.రజనీసార్‌ని మేమే కాదు ఎవరూ కించపరిచే సాహసం చేయలేరు అని ఆ సినిమాకి చెందినవారు వివరణ ఇచ్చారు. సినిమా చూశాక రజనీ సార్‌ కూడా మా సినిమాని మెచ్చుకుంటారని వారంటున్నారు. అదేదో రజనీకాంత్‌కి వారు ముందే తెలియజేసి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. వివాదం ముదిరితే తప్ప, వివరణ ఇవ్వకపోవడం ‘మై హూ రజనీకాంత్‌’ సినిమా యూనిట్‌ తప్పిదం.

మరిన్ని సినిమా కబుర్లు
short flim