Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
super star angryed

ఈ సంచికలో >> సినిమా >>

పూరి సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు

short flim

తెలుగులో టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరైనటువంటి పూరి జగన్నాథ్‌ సినిమాలో అవకాశం దక్కించుకోవడం కష్టసాధ్యం. కాని ఓ కుర్రాడికి ఆ అవకాశం అనుకోకుండా వచ్చింది. అందుకు ఆ కుర్రాడు చేసిందల్లా ఓ షార్ట్‌ ఫిలిం రూపొందించడమే కావడం ఆశ్చర్యం గొలుపుతుంది. భార్యా బాధితుడి ఆవేదనను షార్ట్‌ ఫిలింగా రూపొందించి, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఆ యువకుడి పేరు భద్రం.

పూరి జగన్నాథ్‌కి ఆ షార్ట్‌ ఫిలిం నచ్చింది. అందులో భద్రం నటనకు పూరి ముగ్ధుడైపోయాడు. ‘నేను తీయబోయే సినిమాకి నువ్వు కావాలి..’ అని ఫేస్‌ బుక్‌ ద్వారా ఆ యువకుడికి మెసేజ్‌ పంపాడట పూరి జగన్నాథ్‌. తనను కలవాలని సూచించిన పూరి జగన్నాథ్‌, భద్రం వివరాలను తెలపాలని కూడా కోరాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు, కమెడియన్‌ శ్రీనివాస్‌ అవసరాల, భద్రంకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంటర్నెట్‌లో భద్రం వీడియోకి అనూహ్యంగా క్రేజ్‌ ఏర్పడిరది. పూరి మెచ్చుకున్నంత కంటెంట్‌ అందులో ఏముందో, భద్రం నటనా ప్రతిభ ఏంటో తెలుసుకోవాలని నెటిజన్లు యూ ట్యూబ్‌ని టపా టపా క్లిక్‌ మనిపిస్తున్నారంట. షార్ట్‌ ఫిలింతో పూరి సినిమాలో అవకాశం కొట్టేశాడంటే, ఇప్పటికిది గ్రేట్‌ అఛీవ్‌మెంటే భద్రంకి.

మరిన్ని సినిమా కబుర్లు
illee babe