Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
short flim

ఈ సంచికలో >> సినిమా >>

ఖాన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసిన ఇల్లీబేబ్‌

illee babe

గోవా బ్యూటీ ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ హాట్‌ ప్రాపర్టీ. తమిళంలో కూడా నటించిన ఇలియానా, ఇప్పుడైతే హిందీ సినిమాలకే ఫుల్‌ టైమ్‌ కేటాయించింది. ఫస్ట్‌ మూవీ ‘బర్ఫీ’లో గ్లామర్‌ చూపించకున్నా, పెర్ఫామెన్స్‌తో హిందీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది ఇల్లీ బేబ్‌. వరుసగా అవకాశాలు సంపాదిస్తూ, బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌తో టచ్‌లో ఉంటూ వచ్చిన ఇలియానా ఇప్పుడు కెరీర్‌లో స్పీడందుకుంది.
సైఫ్‌ అలీఖాన్‌తో ఓ సినిమా చేస్తున్న ఇలియానాపై ‘ఖాన్స్‌’ దృష్టిపెట్టారంట. షారుక్‌ఖాన్‌ తన సినిమాలో ఇలియానాకి ఓ రోల్‌ ఆఫర్‌ చేయగా, సల్మాన్‌ కూడా ఇలియానా నటించిన సినిమాలు చూశాననీ ఆమెకి బాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పడంతో అతని కూడా తన సినిమాల్లో ఇలియానాకి అవకాశం ఇవ్వొచ్చని బాలీవుడ్‌లో అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో గ్లామర్‌ డోస్‌ ఎక్కువే ఉండాలి. అందులో ఇలియానా రెండాకులు ఎక్కువే చదివింది. టూ పీస్‌ బికినీతోనూ ఫొటోస్‌ దిగింది.

ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌గా ఇలియానా గ్లామర్‌ని ఇప్పటిదాకా అయితే బాలీవుడ్‌ దర్శకులెవరూ వాడుకోలేదు. ఖాన్స్‌ సినిమాల్లో నటిస్తే మాత్రం ఇలియానా గ్లామర్‌ బాలీవుడ్‌ తెరపై నిండుగా కనిపిస్తుంది. ఆ ముచ్చట కూడా అతి కొద్ది రోజుల్లోనే తీరిపోనుందని టాక్‌. ఆల్రెడీ సైఫ్‌ అలీఖాన్‌తో సైనప్‌ అయిన ఇలియానా, మిగతా ముగ్గురు ఖాన్స్‌ అమీర్‌, సల్మాన్‌, షారుక్‌లతో సినిమాలు త్వరలోనే చేయొచ్చునేమో.

మరిన్ని సినిమా కబుర్లు
golden telangana short film festival