Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with  Bandla Ganesh

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : ఆగడు

Aagadu Movie Review

చిత్రం: ఆగడు
తారాగణం: మహేష్‌బాబు, తమన్నా, సోనూసూద్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణ, నాజర్‌, ఆశిష్‌ విద్యార్థి, వెన్నెల కిషోర్‌, శృతిహాసన్‌, తనికెళ్ళ భరణి తదితరులు
చాయాగ్రహణం: కెవి గుహన్‌
సంగీతం: తమన్‌
నిర్మాణం: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇరోస్‌ పిక్చర్స్‌
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాతలు: అనిల్‌ సుంకర, ఆచంట రామ్‌, ఆచంట గోపీచంద్‌
విడుదల తేదీ: 19 సెప్టెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
శంకర్‌ (మహేష్‌) ఓ అనాధ. ఓ పోలీస్‌ అధికారి రాజారామ్‌ (రాజేంద్రప్రసాద్‌), శంకర్‌ని చేరదీస్తాడు. తాను ఓ పెద్ద పోలీస్‌ అధికారినవుతాననీ, నిజాయితీగా పనిచేస్తానని చిన్నతనంలో హామీ ఇస్తాడు పెంపుడు తండ్రి రాజారామ్‌కి శంకర్‌. కానీ పరిస్థితుల ప్రభావం కారణంగా, పెంపుడు తండ్రి ఆగ్రహానికి గురవుతాడు శంకర్‌. అయితే బుక్కపట్నంకు సీఐగా ట్రాన్స్‌ఫర్‌ అయిన శంకర్‌, అక్కడ దామోదర్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ భరతం పట్టే క్రమంలో అక్కడే అతనికి సరోజతో పరిచయం అవుతుంది. ఓ ‘ఆపరేషన్‌’లో భాగంగా బుక్కపట్నం వెళ్ళిన శంకర్‌, ప్రేమలో విజయం సాధించాడా? విలన్ల భరతం పట్టాడా? పెంపుడు తండ్రి మెప్పును పొందాడా? అన్నవి తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే
పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా ఎంటర్‌టైనింగ్‌ రోల్‌లో మరోసారి మెప్పించాడు మహేష్‌బాబు. ‘దూకుడు’కి కొనసాగింపు పాత్రలా అన్పించినా డైలాగ్‌ డిక్షన్‌లో మార్పుతో మహేష్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. చాలా ఈజీగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాణించాడు మహేష్‌. ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో సినిమాకి అంతా తానే అయిన మహేష్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుకున్నాడు. డాన్సుల్లోనూ మహేష్‌ సూపర్బ్‌ అన్పించాడు.

హీరోయిన్‌ తమన్నా గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. నటనా ప్రతిభ విషయంలోనూ మంచి మార్కులేయించుకుందిగానీ, ఆమెకు స్కోప్‌ తక్కువే వుంది నటన పరంగా. సోనూ సూద్‌ విలన్‌గా రాణిస్తే, బ్రహ్మానందం కామెడీ పార్ట్‌ని భుజానికెత్తుకున్నాడు. వెన్నెల కిషోర్‌, నాజర్‌ సహా ఇతర పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర నటించి, సినిమాకి ప్లస్సయ్యారు.

పంచ్‌ల మీద పంచ్‌లతో సాగింది సినిమా అంతా. పంచ్‌ డైలాగుల మీదనే దర్శకుడు ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. ముందు ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి అర్థమైపోతున్నా, ఎంటర్‌టైనింగ్‌గా సినిమా సాగింది. అదే సినిమాకి ప్లస్‌ అయ్యింది. నేరేషన్‌ బాగుంది. కొన్ని సీన్స్‌ ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేస్తాయి. ఎడిటింగ్‌ బావుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌నెస్‌ని ఇచ్చింది. విజువల్‌ ట్రీట్‌ అని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. మ్యూజిక్‌ పరంగా ఆడియో ఎక్కువమందికి ఇప్పటికే రీచ్‌ అయిపోంది. తెరపైనా పాటలు అందంగా వున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

ఫస్టాఫ్‌ అంతా యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరదా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంక్‌ బావుంది. సెకెండాఫ్‌లో ప్రతీకారం తీర్చుకునే దిశగా హీరో కాన్సన్‌ట్రేషన్‌ వుండటం, ఎంటర్‌టైన్‌మెంట్‌ కొంచెం తగ్గడంతో సెకెండాఫ్‌ కన్నా ఫస్టాఫ్‌ బావుంటుందనిపిస్తుంది. సెకెండాఫ్‌ ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్ది వుంటే బావుండేది. ఓవరాల్‌గా సినిమాకి బావుందనే సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడేలా వుంది. భారీ అంచనాల  నేపథ్యంలో విడుదలైన సినిమా గనుక, ఆ స్థాయిలో సినిమాని రూపొందించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కానీ ఓ మోస్తరు ఎంటర్‌టైనర్‌ ఇవ్వడంలో దర్శకుడు తన మార్క్‌ చాటుకున్నాడు. అభిమానులకు మాత్రం పండగే అన్నట్లుగా మహేష్‌ వన్‌ మాన్‌ షో ప్రదర్శించాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే : ఫ్యాన్స్‌ని సంతృప్తిపరిచే ‘ఆగడు’

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka