Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కోడిగుడ్డు ములక్కాయ కూర - పి . శ్రీనివాసు

Egg Drumstick curry

కావలిసిన పదార్ధాలు:
కోడి గుడ్లు (ఉడకబెట్టినవి)
టమాటాలు
ఉల్లిపాయలు
మునక్కాడలు
పచ్చిమిర్చి
నూనె
కరివేపాకు
పసుపు
కారం
ఉప్పు
కొత్తిమీర

 తయారుచేసే విధానం:
ముందుగా బాణాలిలో  నూనె పోసి అది కాగాకా అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేగనివ్వాలి. తరువాత అందులో మునక్కాడలు వేసి కలిపి ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసి కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి అర గ్లాసు నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి. తరువాత మూత తీసివేసి ఆ నీరంతా ఇనికేవరకు ఉడకనివ్వాలి. తరవాత కొత్తిమీరని చల్లాలి.

వేడివేడి చపాతీలలో ఈ కోడిగుడ్డు ములక్కాయ కూర చాలా బాగుంటుంది...

మరిన్ని శీర్షికలు