Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

ఈ ‘గోవిందుడు’ ఏం చేయబోతున్నాడు?

waiting for govindudu

రామ్‌చరణ్‌ హీరోగా వస్తున్న ‘గోవిందుడు అందరివాడు’ సినిమాపై టాలీవుడ్‌ వర్గాల్లో ఉన్న ఆసక్తి పదింతలయ్యిందంటే దానికి కారణం, దసరా సీజన్‌లో వచ్చిన సినిమాలేవీ ఇప్పటిదాకా అంచనాల్ని అందుకోకకపోవడం మూలానే. ‘పవర్‌’ వసూళ్ళు బాగున్నా, ఫ్యామిలీ సినిమా పండక్కి వస్తే ఆ కిక్కే వేరు. ఆ లోటు తీర్చడానికి వస్తున్నాడు ‘గోవిందుడు అందరివాడేలే’. ఎన్టీయార్‌ ‘రభస’తో, మహేష్‌ ‘ఆగడు’తో నిరాశపర్చడంతో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమానే అభిమానుల్ని పూర్తిగా సంతోషపెట్టగలదనే ఆశ సినీ జనాల్లో కనిపిస్తుంది.
కృష్ణవంశీ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఆయన రూపొందిచిన సినిమాల్లో ‘మొగుడు’ ఒక్కటే నిరాశపర్చింది. అందుకనే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇండస్ట్రీ కళకళ్ళాడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘గోవిందుడు అందరివాడేలే’ హిట్టవ్వాలి. సినిమా రషెస్‌ చూశామంటూ సినిమాపై కొంతమంది ‘ప్లస్‌’ టాక్‌ చెప్పడం ప్రీ రిలీజ్‌ అంచనాలు పెరిగేలా చేస్తుంది.

ఇప్పుడు ఇండస్ట్రీకి మంచి హిట్‌ కావాలి. కొన్నాళ్ళ క్రితం ఈ ‘గోవిందుడు’ గురించే కొన్ని నెగెటివ్‌ టాక్స్‌ వచ్చాయి. చరణ్‌ సినిమాలకి అది మామూలే. సినిమా రిలీజ్‌ టైమ్‌ దగ్గరకు వచ్చేసరికి మంచి టాక్‌ సంపాదించుకున్నాడు ‘గోవిందుడు’. అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న గోవిందుడు ఏం చేయబోతున్నాడో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
mass not now