Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
waiting for govindudu

ఈ సంచికలో >> సినిమా >>

మాస్‌ ఇప్పుడు వద్దు బాస్‌

mass not now

మాస్‌ సినిమాల నుంచి దూరంగా కొన్నాళ్లు వుండాలని ఎన్టీయార్‌ డిసైడ్‌ అయ్యాడంట. అతను నటించగా వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్‌ అవుతుండేసరికి, ఎన్టీఆర్‌ ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో. గెటప్‌ ఛేంజ్‌ వరకూ ఇప్పటికే చాలా విధాలుగా ట్రై చేశాడతను. ఇప్పుడు చూపించబోయే మార్పు, శారీరక భాషలో ఉంటుందని టాక్‌.

ఒకప్పటి ఎన్టీఆర్‌ మళ్ళీ తెరపై కన్పించేలా అతని స్టైలిస్ట్‌లు కూడా ‘స్కెచ్‌’ ప్రిపేర్‌ చేస్తున్నారన్న ఊహాగానాలు అభిమానులుకు ఆనందాన్ని ఇవ్వడం సహజం. ఎందుకంటే, ఎన్టీఆర్‌ వయసుకు మించిన పాత్రలు తక్కువ వయసులోనే చేసి, పెద్ద పెద్ద హిట్స్‌ కొట్టాడు. ఇప్పుడు వయసుకు తగ్గ సినిమాలు చేస్తున్నా, నిరాశ పర్చుతున్నాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి రీచ్‌ అయితే ఇమేజ్‌ మారి, తద్వారా సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కవచ్చన్న మంచి ఆలోచన కలిగిందట ఎన్టీఆర్‌కి.

‘అత్తారింటికి దారేది’ సినిమాతో ట్రెండ్‌ మారింది. చరణ్‌ కూడా మూస మాస్‌ సినిమాలు చేసి, ‘గోవిందుడు అందరివాడేలే’ అంటూ క్లీన్‌ సినిమా వైపు మళ్ళాడు. ఎన్టీఆర్‌ కూడా అదే మార్పు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారమ్‌. మార్పు మంచిదే. కొన్నాళ్ళు మాస్‌ని దూరం పెడితే, కొన్నాళ్ళ తర్వాత చేసే మాస్‌ సినిమాకి మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
North beauty in telugu look...