Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mass not now

ఈ సంచికలో >> సినిమా >>

ఉత్తరాది ముద్దుగుమ్మ తెలుగుదనం

North beauty in telugu look...

ఉత్తరాది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి తెలుగులో మాట్లాడాలనే ‘టార్గెట్‌’ తొలి తెలుగు సినిమాకే పెట్టుకుందట. ఆ సినిమా పూర్తయ్యేలోగా టార్గెట్‌ చేరుకోలేకపోయినా, కొంచెం కష్టపడి తరువాతి సినిమాకి తెలుగులో మాట్లాడటం నేర్చేసుకున్నానని రకుల్‌ చెప్పింది. ఏ భాషలో నటిస్తున్నామో ఆ భాష తెలిస్తే, తద్వారా నటన తేలికవుతుందని విశ్వసిస్తుందట ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో కుర్రాళ్ళ అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకున్న మెరుపుతీగ రకుల్‌.

తెలుగులో చకచకా సినిమాలు చేస్తున్న రకుల్‌, గోపీచంద్‌తో ‘లౌక్యం’ సినిమాలో నటించింది. మనోజ్‌తో నటించిన ‘కరెంట్‌ తీగ’ విడుదలకు సిద్ధమైంది. ‘కరెంట్‌ తీగ’ సినిమాలో స్కూల్‌ అమ్మాయిలా కనిపించనున్నట్లు వెల్లడిరచిన రకుల్‌, ఆ సినిమాలో తన పాత్ర తనకెంతోగానో నచ్చిందని అంటోంది.

డబ్బింగ్‌ కూడా తెలుగులో చెప్పుకోవాలని అనుకుంటున్నప్పటికీ, అంత పెర్‌ఫెక్ట్‌గా తెలుగులో మాట్లాడలేకపోతున్నందున ఇంకొన్ని సినిమాల వరకూ ఆ ఆలోచనను పక్కన పెడుతుందట రకుల్‌. ఎప్పటికైనా డబ్బింగ్‌ తెలుగులోనే చెప్తానని కాన్ఫిడెంట్‌గా కన్పిస్తోందీ ఉత్తరాది భామ. తెలుగు భాషపై కొందరు హీరోయిన్లకు అమితమైన అభిమానం వుంటుంది. నిత్యామీనన్‌ వంటి కొద్దిమంది స్పష్టంగా తెలుగులో మాట్లాడగలుగుతారు. ఆ స్థాయిలో రకుల్‌ కూడా తెలుగు మాట్లాడితే, ఉత్తరాది ముద్దుగుమ్మ అందం రెట్టింపవకుండా వుంటుందా?

మరిన్ని సినిమా కబుర్లు
most confident akhil