Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
most confident akhil

ఈ సంచికలో >> సినిమా >>

జేజెమ్మ వెళితే జేజేలు పలకరా?

bollywood grand welcome to anushka.....

‘అరుంధతి’ అనుష్క కెరీర్‌ని మార్చేసింది. అప్పటివరకూ ఆమె చేసినవన్నీ రొటీన్‌ గ్లామరస్‌ పాత్రలే. ‘అరుంధతి’ తర్వాత అనుష్క అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో చాలా క్రేజ్‌ ఏర్పడిరది. గ్లామరస్‌ పాత్రలు చేస్తున్నా, వీలు చిక్కినప్పుడల్లా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ, అనుష్క తన రేంజ్‌ని పెంచుకుంటూ వచ్చింది.

ఇప్పుడేమో అనుష్కని హిందీ సినిమా పరిశ్రమ పిలుస్తున్నట్లు సమాచారమ్‌. కాజల్‌, తమన్నా, అసిన్‌, త్రిష లాంటివారు హిందీ సినిమాల్లో నటించారు. వారిలో కొందరికి హింఈలో సక్సెస్‌ దక్కింది. అనుష్క హిందీకి వెళితే ఆమెకు అక్కడి జనం జేజేలు పలకకుండా ఉండరు. ఎందుకంటే నిండైన విగ్రహం ఆమె సొంతం. అదొక్కటే కాదు, అనుష్క అంటేనే గ్లామర్‌. అది ఆమెకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల గురించి హిందీ సినీ పరిశ్రమలోనూ ఆసక్తి ఉంది. దాంతో అనుష్కపై అక్కడి సినీ జనం ఎక్కువగా ఆలోచిస్తున్నారట. ఓ బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనుష్కతో సినిమా చేయాలనుకుని, ఆమెను సంప్రదించాడట కూడా. ఇ.నివాస్‌ అనే దర్శకుడి తొలి హిందీ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇదివరకు వచ్చిన ఆఫర్లను కాదన్న అనుష్క, ఇప్పుడైనా హిందీ పరిశ్రమ వైపు వెళ్తుందంటారా?

మరిన్ని సినిమా కబుర్లు
my documentary on shiva