Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Dasara

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : తనను అమితంగా ఆకర్షించిన అపరిచిత అమ్మాయి కోసం ఆతృతగా వెతుకుతున్న విరాట్ కి విశాల మళ్ళీ ఎదురు పడుతుంది.. చీరకట్టులో అందంగా కంపించిన విశాల ఐలవ్యూ చెబుతుంది. ఆమెను తప్పించుకోవడానికి తనకు పెళ్ళయిందని చెప్పినా ఆమె నమ్మదు..........................
........................ఇక చదవండి...

­­. మరోసారి షాకయ్యాడు విరాట్.

ఎదుటివారి మాటల్ని జల్లెడ పట్టి నిజాల్ని పక్కకు తీయటం అసాధారణ విద్య.  బిజినెస్  వుమెన్  కదా ఈమెను నమ్మించటం అంత ఈజీ పని కాదు. ఓరి దేవుడా ఈ అమ్మాయిలకింత తెలితేటల్ని ఎందుకిచ్చావయ్య బాబు.  మగాళ్ళమే బ్రతకనక్కర్లేదా?  మనసు లోనే ఉడుక్కున్నాడు.

‘‘న్నే నిజమే చెప్పాను’’  అంటూ బొంకాడు.
‘‘అది నిజం కాదని నాకు తెలుసు.  అందుకని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు.  నువ్వు ఎవరయినా గానీ... ఈ విశాలనీ ది దట్సాల్. ముచ్చటగా మనం మూడోసారి కలుసు కు న్నప్పుడు  మంచి వార్త చెప్తావని ఆశిస్తాను,  వస్తాను’’  అంటూ మరోసారి ప్రేమగా విరాట్ చేయి అదిమి స్టేషన్లోకి వెళ్ళిపోయింది విశాల.

సరిగ్గా ఆమె వెళ్ళిన పదకొండో సెకన్లొ హడావిడిగా వచ్చి కలుసుకున్నాడు చందూ.  ఇపుడు ప్లాట్ఫాం  మీదకెళ్తే రైల్లో కూడా విశాల బుర్ర తింటుదనిపించి పది నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు తర్వాత చందూతో స్టేషన్లోకి అడుగుపెట్టాడు విరాట్.

వారం గిర్రున తిరిగిపోయింది.

కాని విరాట్ కోరుకున్నఆజ్ఞాత సుందరి జాడ మాత్రం తెలీలేదు.  అయినా నిరాశ చెందటం లేదు విరాట్. ఆమె మీద ఆశ వదులుకోలేదు. నమ్మకం వదులు కోలేదు. ఆలస్యమయ్యే కొద్ది అతనిలో పట్టుదల పెరుగుతోందే గాని తగ్గలేదు.  ఈ లోపల సర్వీసుకిచ్చిన అతడి బైక్కూడా చేతికొచ్చింది.  దాంతో ఆఫీసు టైమ్లో కూడా ఏదో వంకతో బయటికెళ్ళి ఆ అమ్మాయి కోసం గాలించి వస్తున్నాడు.

ఈ వారం రోజులూ ఎలాగో ఓపిక పట్టాడు చందూ. కాని ఉండేకొద్ది విరాట్ ఆమె కోసం పడుతున్న ఆరాటం ధ్యాస అతనికి నచ్చటం లేదు.  సోమవారం సాయంత్రం ఇంటికి రాగానే ఇక ఉండబట్టలేక అడిగేసాడు.

‘‘ ఒరే విరాట్...  ఇదేం బాగలేదురా. నాకస్సలు నచ్చటం లేదు’’  అన్నాడు విసుగ్గా.

‘‘ఏం నచ్చలేదు నీకు? ’’  కాజువల్గా అడిగాడు విరాట్.

‘‘అదే కనిపించని ఆ పిల్లకోసం నువ్విలా పిచ్చిగా అదే పనిగా వెదుకులాడ్డం నచ్చలేదంటున్నాను. అదే మెరుపులా మెరిసి మాయమైన ఆ పిల్ల ఎక్కడుందో గాని తను మామూలుగానే ఉండి ఉంటుంది. కాని నువ్వేమిట్రా ఇలా తయారయ్యావ్.  ఆఫీసు పని కూడా ఎగ్గొట్టి వూరు మీదపడి వెదుకులాడ్డాం, వదిలేయరా ’’  నచ్చజెప్పబోయాడు.

‘‘వదులుకోలేను! ’’ విరాట్ గొంతులో పట్టుదల ధ్వనించింది.

‘‘అంటే...  ఆమె కనబడకపోయినా జీవితాంతం యిలా వెదుకులాడుతూనే ఉంటావా?’’ అన్నాడు కోపంగా.

‘‘అక్కర్లేదు.  ఆమె కన్పిస్తుంది. నాకా నమ్మకముంది’’

‘‘ఇదేం నమ్మకంరా బాబు గుడ్డి నమ్మకం. నామాట వినరా మర్చిపోరా. నిజంగా మీ ఇద్దరికి రాసిపెట్టి వుంటే ఏదో రోజు తానే నీ ముందుకొస్తుంది. అంతేగాని తన కోసం వెదకటం అంటే పిచ్చిపని’’

‘‘ఓకే...  నా పిచ్చి నాకానందం లీవిట్’’

‘‘అంతేగాని వెదకటం ఆపనంటావ్.  ఎలా?  వారం రోజులు వెదికినా దొరకలేదు. ఎలా పట్టుకుంటావ్...? నీ ఫోన్నంబరిచ్చి రైల్వే స్టేషన్లో బ్యానర్లు వేలాడదీయాలి లేదా పోష్టర్లు అతికించాలి.  ఖర్మరాబాబు.  ‘‘ టెన్ టు నైన్’’ అన్నావ్. మనిషికి ఈ దిక్కుమాలిన ప్రేమలెందుకిచ్చాడో గాని దేవుడు దీని వల్ల సమయం వృధా. సొమ్ములు వృధా. ఆలోచనలు వృధా. ఇన్ని వృధాలతో బాటు మనశ్శాంతి లేకుండా పోతుంది.  ఛ ఇక నీకు సాయం చేయలేను.  నీ తంటాలు నువ్వుపడు’’ అంటూవిసుగ్గాకిచెన్లోకి వెళ్ళిపోయాడు  చందూ.

చందూ కోప్పడితే పడ్డాడు గాని` అతడి మాటలు విరాట్ని ఆలోచింపచేసాయి.  ఏదో పరిష్కారం గోచరించింది. అవును రైల్వేస్టేషన్లో బేనర్ కట్టినా పోష్టర్లు అతికించినా ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఏదో టైమ్లో స్టేషన్కొచ్చినప్పుడు ఆమె చూస్తుంది.  చూసి ఫోన్ చేస్తుంది. ఈ ఆలోచనరాగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు విరాట్. మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ రా చందూ. అనుకుంటూ చందూకి

చెప్పకుండానే బయటకొచ్చి బైక్స్ టా  చేసుకొని వెళ్ళిపోయాడు.

కాస్సేపటికి బయటకొచ్చిన చందూకి విరాట్ కన్పించలేదు... అతడి బైక్ కన్పించలేదు.

అంతక్రితమే కాలనీలో వీధిలైట్లు వెలిగాయి. తూర్పు నుండి చెన్నైమీదకు చీకట్లు ముసురుకుంటున్నాయి.  ఈదురుగాలి జివ్వున వీస్తోంది. చందూకి ఏమీ అర్థంకాక జుత్తు పీక్కున్నాడు. ఈ టైమ్లో వీడు ఒంటరిగా ఎక్కడికెళ్ళినట్టు ఎందుకెళ్ళినట్టు అనుకుంటూ.

తెల్లవారే సరికి ఎగ్మోర్  రైల్వేస్టేషన్లో`

గోడలకు స్తంభాలకు అతికించిన అనేక పోష్టర్లు దర్శనమిచ్చాయి. స్టేషన్లో అడుగుపెట్టిన వాళ్ళు ఆ పోస్టర్స్ చూసి టక్కున ఆగిపోయి అందులో మేటర్ని ఆసక్తిగా చదువుతున్నారు. ఎవరోఆజ్ఞాత ప్రేమికుడిలా ఉన్నాడు అని చెప్పుకొని నవ్వుకోసాగారు.

బేనర్ మీద ఎలాంటి బొమ్మలూ లేవు.

ఇట్టే ఆకర్షించి శుభాన్నిచ్చే లేత పసుపు రంగుపేపర్  మీద కేవలం అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అందులో...

హాయ్ బ్యూటీ....

నువ్వెవరో ఎక్కడుంటావో  వివరాలు తెలీదు.  అనుకోకుండా గతవారం మనిద్దరం ఎగ్మోర్  రైల్వేస్టేషన్నుండిటినగర్ స్టేషన్ వరకు రైల్లో కిటికి పక్కన ఎదురు బొదురుగా కూచొని ప్రయాణం చేసాం. నిన్ను చూడగానే ఏదో తెలీని ఆకర్షణ.  నీ గురించి తెలుసుకోవాలనుకునే లోపలే నువ్వు టి నగర్ స్టేషన్లో దిగిపోయావ్. తిరిగి కన్పించలేదు. ఈ వారం రోజులుగా నీ కోసం గాలిస్తూనే వున్నాను.  ఇంకా నేను గర్తుకురాలేదా? ఒక్కసారి మన మధ్యన సాగిన సంభాషణ గమనించు గుర్తొస్తాను.

‘‘హాయ్  మిస్.... అని పిలిచాను’’

నువ్వు తలెత్తి చూసావ్

‘‘టైం ప్లీజ్!’’  అడిగాను.

‘‘మీ దగ్గర వాచీ లేదా?’’ అన్నావ్.

‘‘లేదు’’ అన్నాను.

‘‘మీ హేండ్ బేగ్ చాలా చాలా బాగుంది వెరీ నైస్’’  అన్నాను.

‘‘బాగుంది గాబట్టే కొన్నాను’’ అన్నావ్.

పరిచయం పెంచుకోవాలని ఎక్కడకొన్నారు?  అని అడిగే లోపే నువ్వు రైలు దిగి వెళ్ళిపోయావ్.  సో నా మనసులో తీపి గాయం లేపి నీ దారిన నీవు వెళ్ళిపోటం బాగాలేదు.  ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడవా?  ప్లీజ్....

నా సెల్ నెంబరు....

పై విధంగా మేటర్  ప్రింటయి కిందసెల్  నంబర్ ఇవ్వబడిరది. అంతకు మించి వివరాలేవీ యివ్వలేదు.

ఈ విధంగా ఒక్క ఎగ్మోర్  స్టేషన్తో వదల్లేదు. టి నగర్  స్టేషన్లలో కూడా పోస్టర్లు తెల్లవారే సరికి సంచలనం సృష్టించాయి.

గత సాయంత్రం చందూతో చెప్పకుండా బైక్మీద వెళ్ళిన విరాట్  అర్థరాత్రి దాటాక ఎప్పుడో ఇంటికి చేరుకున్నాడు.  మధ్యలో చందూ ఫోన్ చేసినా అందకుండా ఫోన్  స్విచ్ఛాఫ్లో ఉంచాడు. రాత్రికి రాత్రి పోస్టర్లు రెడీ చేయించి ఎవరెవరినో మేనేజ్ చేసి ఆయా స్టేషన్లలో అతికించే ఏర్పాట్లుచేసి తిరిగి వచ్చేసరికి ఆ టైమైంది.  ఇందు కోసం చాలా ఖర్చు చేసాడు. కాని చందూకి తెలియదు. అతను అడిగితే ఏదో సర్దిచెప్పాడు. ఉదయంబైక్ మీద ఆఫీసుకు రావటం వలన రైల్వేస్టేషన్లలో పోస్టర్స్ గురించి చందూకి తెలీదు. పోస్టర్స్ మీద ఇచ్చింది తన పాత పర్సనల్ నంబర్ గాబట్టి అది తనదని ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

ఏదో స్టేషన్లో తన సఖి ఆ బ్యానర్ చూస్తుందని విరాట్ నమ్మకం. చూసి తప్పకుండా ఫోన్ చేస్తుందని ఆశ. ఆఫీస్లో రోటీన్గా వర్క్ చేస్తున్నాడు గాని ధ్యాసంతా ఫోన్  మీదే వుంచాడు. అతడి అంచనా నిజం చేస్తూ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఫోన్ మోగింది.

విరాట్  మనసు ఆనందంతో గంతు లేసింది.

తన ఫ్లాన్  వర్కవుటయినందుకు మహదానందం చెందుతూ ఫోన్ లిప్ట్ చేసాడు.‘హలో ! ఎవరండీ?’’  అవతల నుంచి ఒక మృధు మధురమైన గొంతు పలకరించింది.

‘‘మీరెవరండీ?’’  అడిగాడు విరాట్.

‘‘అయాం సంజనా . స్టేషన్లో పోస్టర్స్ అతికించింది మీరేనా?’’

‘‘యస్’’

‘‘ఆ రోజు రైల్లో మీ ఎదురుగా కూచుంది నేనే’’

ఆ గొంతు వింటుంటే`

ఎందుకో ఈ అమ్మాయి కాదు అన్పించింది.

కిటికి పక్కన రైట్లో కూచున్నావా లెప్ట్లో కూచున్నావా? అనగానే ఆమె రాంగ్ చెప్పింది. నువ్వుకాదు అని లైన్ కట్చేసాడు విరాట్.రాంగ్ కాల్స్ వస్తాయని విరాట్ వూహించ లేదు. ఆ అమ్మాయి మాత్రమే ఫోన్ చేస్తుందనుకున్నాడు.  కాని అందుకు భిన్నంగా ఎవరెవరో అమ్మాయిలు నేనంటేనేనని పోటీపడడంతో లంచ్  టైమ్ లోపల కనీసం ఇరవైమంది ఫోన్ చేసుంటారు.

సాయంత్రం మూడుగంటలకి సడెన్గా చందూ విరాట్ చాంబర్లోకి ఎంటరయ్యాడు. ‘‘ఏరా. నే విన్నది నిజమేనా?’’  అనడిగాడు వస్తూనే.‘‘ఏంవిన్నావ్?’’  ఏమీ తెలీనట్టు అడిగాడు విరాట్.

‘‘అదే.. రైల్వేస్టేషన్లో స్టర్ల సంగతి. లంచ్ టైమ్లో మన వాళ్ళు చెప్పుకొంటుంటే విన్నాను’’.

‘‘అలాగా... నాకేం తెలీదే’’.

‘‘ఒరే నాకొస్తున్న కోపానికి ఏం చేస్తానో నాకే తెలీదు. నాతో ఎందుకురా అబద్ధం చెప్తావ్?  రాత్రి ఏదో వేళాకోళంగా అన్నానో లేదో...  తెల్లారేసరికి చేసి చూపించేసావ్. అర్థరాత్రి ఇంటికొచ్చినప్పుడే ఏదో ఘనకార్యం చేసుంటావని సందేహించాను. ఇదన్నమాట. ఇంకా బుకాయించక. నేను స్టేషన్కెళ్ళి వాటిని చూసొచ్చాను. అది నీ పనే’’

‘‘ఇదే ఇలా ఆవేశపడతావనే నీతో చెప్పను.  రాత్రి మంచి ఐడియా ఇచ్చావ్కదా.  ఫాలో అయిపోయాను. చూద్దాం రిజల్ట్  ఎలా వుంటుందో’’  అంటూ  నవ్వాడు విరాట్.

‘‘ఇంతకీ...  తను ఫోన్ చేసిందా?’’ అడిగాడు చందు.

‘‘తను తప్ప చాలామంది చేస్తున్నారు.  వాళ్ళని చూస్తుంటే డబ్బున్న అబ్బాయిల కోసం అమ్మాయిలింతగా బరితెగిస్తున్నారేమిట్రా బాబూ అన్పిస్తుంది.’’

‘‘నీకలా అన్పించొచ్చు. కాని లోకం తీరే అది. ఇక ఆ అమ్మాయి కన్పించదు.’’

‘‘అప్పుడే నిరాశ పడక్కర్లేదు. ఇవాళగాకపోతేరేపు తప్పకుండా తను ఫోన్ చేస్తుంది.’’

‘‘నీలా నమ్మకాలతో బతికేయటం నావల్ల కాదురాబాబూ.  ఉన్నట్టుండి నీకేదో ప్రేమదయ్యం పట్టుకుంది. అందుకే యిలా వున్నావ్’’ అని విసుక్కొంటూ తన సీట్లోకి వెళ్ళిపోయాడు చందు.

ఆ రోజు చాలా మంది యువతులు విరాట్  సెల్కిఫోన్ చేసి నేనంటేనేనని పోటీపడ్డారు. కాని వాళ్ళల్లో అతడు కోరుకున్న అమ్మాయి మాత్రం లేదు. ఆ రోజు గడిచిపోయింది. ఆ ఆజ్ఞాతసుందరి సిటీలో ఎక్కడ ఉందో, పోస్టర్స్ చూసిందొ లేదో తెలీదుగాని ఆమె నుంచి మాత్రం అతను ఆశించనట్టు ఫోన్ కాల్ రాలేదు. మరునాడు కూడా షరామామూలే. పరిస్థితిలోమార్పులేదు. ఆరోజు సాయంత్రం...

అఫీసు వదలగానే విరాట్ చందూలు ఎప్పటిలాగే తమ బైక్మీద ఇంటికి బయలుదేరారు. తనది ఫారెన్ బైక్  గావటంతో సాధారణంగా తనే జాగ్రత్తగా నడుపుతాడు విరాట్. చందూ వెనకాల కూచుంటాడు. ఎప్పుడోగా నిబండినడిపే అవకాశం చందూకి ఇవ్వడు.

దారిలో హోటల్  బుహారిలో కాఫీ తాగి ఆ పక్కనే మార్కెట్లో ఇంటికి అవసరమైన కూరగాయలు అవీ తీసుకొని బయలుదేరేప్పటికి చీకటి పడి వీధిలైట్లు  వెలిగాయి.  క్రమంగా విరాట్ బైక్ తమ గోస్వామి కాలనీని సమీపించింది. కాలనీ గేటు కనబడుతోంది. ఇంతలో...వీరి వెనకే స్కూటీ ఒకటి నిశ్శబ్ధంగా విరాట్  బైక్ను ఓవర్ టేక్ చేసింది. అది ఎలక్ట్రానిక్ బైక్. ఆ బైక్మీ ద హెల్మెట్ ధరించిన యువతులిద్దరున్నారు. వాళ్ళు తమని ఓవర్టేక్ చేయటం చూసి నుదురు కొట్టుకున్నాడు చందూ.

‘‘ఖర్మరాబాబు.  అమ్మాయిలు కూడా మనల్ని ఓవర్టేక్  చేసి వెళ్ళిపోతున్నారు.  అదీ బేటరీ స్కూటీ మీద. ఇది నీ ఫారెన్ బైక్కే అవమానం. వాళ్ళకన్నా ముందే మనం గేటుదాటి కాలనీలోకి వెళ్ళిపోవాలి.  పోనీ’’ అనరిచాడు.

అతనిమాటలకివిరాట్ ఏమీరెచ్చిపోలేదు. ఆవేశపడలేదు. బైక్ వేగంలో మార్పులేదు. చందు మరోసారి ఉడుక్కున్నాడు.

‘‘ఈ మాత్రం స్పీడ్కి ఫారెన్  బైక్  కావాలా..?’’  అనడిగాడు.

‘‘చేతిలో ఫారెన్  బైక్  ఉందని ఇష్టానికి నడపటం అవసరమంటావా?  వాళ్ళకేదో అర్జంటు పనుండి వేగంగా వెళ్తున్నారు.  ఏ పనీ లేకుండానే మనం ఎందుకు వేగంగా వెళ్ళాలి? ఎప్పుడు ఎంత అవసరమో అంతవే గాన్నే ఉపయోగించాలి. ఇంటిదగ్గర కాచ్చాక కూడా అనవసరంగా కుప్పి గంతులేయక.  కూచో’’ అంటూ బదులిచ్చాడు.

విరాట్ బైక్ వేగంపెంచి ఆ స్కూటీని ఓవర్ టేక్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలీదుగాని గేటు ఇంకో రెండువందల గజాల దూరంలో ఉందనగానే అమ్మాయిల స్కూటీగేటు దాటి కుడిపక్కకు తిరిగి మూదో వీధిలోకి దూసుకుపోయింది.

ఆ వెనకే విరాట్  బైక్  గేటుదాటి ఎడం పక్కకు తిరిగి మొదటివీధిలో ప్రవేశించి మూడోయింటి ముందాగింది.  చందు బైక్ దిగి వెళ్ళి తాళం తీసి గేటు తెరవగానే బైక్ లోనకు పోనిచ్చాడు విరాట్.ఒక్కోసారి విధిచేసే విచిత్రాలు భలే తమాషాగాను అంతుబట్టకుండాను ఉంటాయి.  మతిమరుపు వల్ల కూడా ఇలాంటి తమాషాలు అరుదుగా జరుగుతుంటాయి.  పెన్నుజేబులోనే ఉంటుంది. కాని పెన్ను కోసం గదంతా గాలిస్తాం.  కళ్ళజోడు ముందరే ఉంటుంది.  కాని కళ్ళజోడు ఎక్కడ పెట్టామని వెదుకులాడతాం.  ఆఫీసు పైలు ఎదురుగా టేబుల్ మీదే వుంటుంది.  కాని ఫైలు ఏమైందాని గదంతా తిరగబెట్టేస్తాం. ఇలాంటివన్నీ మతిమరుపు వల్ల జరిగే తమాషాలు.

మనక్కావలసిన మనిషి కోసం దేశమంతా వెదుకుతుంటాం.  తీరాచూస్తే వాడు మన ఇంటి సమీపంలోనే ఉంటాడు.  ఒక్కోసారి పోయిన వస్తువు ఇక దొరకదులే అనుకుంటాం. విచిత్రంగా అది దొరుకుతుంది. ఇక్కడ విరాట్  విషయంలో కూడా అలాంటి అనూహ్య సంఘటనే చోటుచేసుకుంది.

నిజానికి ఆ పూట అతడి బైక్ను ఓవర్  టేక్  చేసి స్కూటీ మీద కాలనీలోకి దూసుకెళ్ళిన యువతులిద్దరూ ఎవరో కాదు. ఎవరి కోసమైతే మొన్న రాత్రికి రాత్రి రైల్వేస్టేషన్లలో తన ఆజ్ఞాతసుందరి కోసం బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటుచేసాడో ఆ ఆజ్ఞాతసుందరి ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్న బ్యాటరీ స్కూటీ గోస్వామికాలనీలో ని మూడో వీధిలో చిట్టచివరదైన నూట అరవైయ్యో నంబరు విల్లా గేటు ముందు ఆగింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్