Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

టాలీవుడ్‌లో లక్కీ బ్యూటీ ఎవరంటే

who is lucky beauty in tollywood

తొలి చిత్రంతోనే ఎక్స్‌ప్రెస్‌లా దూసుకొచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆ సినిమా చూడగానే, ‘కొత్తగా వుందే’ అనిపించిందామె. నటనలో ఇంకా షార్ప్‌ అవ్వాలి అనుకున్నారు కొందరు. తనకు సంబంధించి అంతా ప్లస్‌ టాక్‌ వచ్చేసరికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సంబరపడిరది. అవకాశాల్ని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంది. అలా ‘లౌక్యం’ సినిమాకి కమిట్‌ అయ్యింది. ఆమె గోల్డెన్‌ లెగ్‌ ఫలితం ఆ సినిమా సక్సెస్‌ అయ్యింది.

అందుకనే తెలుగులో ఇప్పుడు హాట్‌ లక్కీ బ్యూటీ ఎవరంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు చెప్తున్నారు. మనోజ్‌తో ‘కరెంట్‌ తీగ’ సినిమాలో నటిస్తోంది రకుల్‌ ప్రీత్‌. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధమయ్యింది. ‘కరెంట్‌ తీగ’ కూడా హిట్టయితే రకుల్‌ ప్రీత్‌ రేంజ్‌ పెరిగిపోతుంది. సక్సెస్‌ హ్యాట్రిక్‌ కొడితే ఆమె టాప్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లోకీ చేరిపోవడం ఖాయం.

అవకాశాలకైతే లోటు లేదు కనుక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు కెరీర్‌ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి. ఆ ప్లానింగ్‌ తనకు వుందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెబుతోంది. ఇకనేం, టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ ఛెయిర్‌ వైపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వేగవేగంగా దూసుకుపోవడం ఖాయం అనుకోవచ్చునేమో. గ్లామరస్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్ళాలని విషెస్‌ అందిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
govindudu changed charan