Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
govindudu changed charan

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

కలవరపెడుతున్న ‘అమ్మ’ సినిమా

mother movie creating tention

కన్నడ సెక్సిణి రాగిణి ద్వివేది నటిస్తోన్న ఓ సినిమా దేశమంతటా చర్చకు దారితీసింది. ఆ సినిమా టైటిల్‌ ‘అమ్మ’ కావడమే వివాదానికి కారణంగా చెప్పవచ్చును. ‘అమ్మ’ సినిమాలో హీరోయిన్‌ రాగిణి ద్వివేది పాత్ర పేరు జయ అంట. జయ అంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనే స్ఫురణకు వస్తుంది.

అవినీతి కేసులతో జయలలిత జైలుకు వెళ్ళారు. అంతలోనే ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. తమిళనాడులో జయలలితను ‘అమ్మ’ అని ఆమె అభిమానులు పిలుచుకుంటారు. కన్నడంలో ‘అమ్మ’ పేరుతో సినిమా వస్తోంది. కర్నాటకలోని జైల్లోనే ఉన్నారు జయలలిత. కర్నాటకలోని బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు జైలు శిక్ష విధించింది. కర్నాటకకు, తమిళనాడుకీ మధ్య నీటి వివాదాలున్నాయి.ఇన్ని కారణాలతో ‘అమ్మ’ సినిమా వివాదాస్పదమవుతున్నది. జయలలిత కూడా ఒకప్పుడు పేరు మోసిన సినీ తార. సినీ రంగంలోనుంచి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలిత, తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే ‘అమ్మ’ సినిమాలో కథాంశమేమిటో తెలియడంలేదు. ఆ కథాంశంపై దర్శకుడు, నిర్మాత వివరణ ఇస్తే వివాదం సద్దుమణిగే అవకాశం ఉన్నది.

మరిన్ని సినిమా కబుర్లు
vishal stand by promise