Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mother movie creating tention

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

విశాల్‌ మాట మీద నిలబడ్డాడు

vishal stand by promise

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ రూపొందించిన ‘హైదర్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు హీరోయిన్‌ శ్వేతా బసు ప్రసాద్‌, వ్యభిచారం కేసులో అరెస్టయ్యాక ఆమెకు మద్దతు పలకడం ద్వారా తెలుగు వారికి సుపరిచితుడయ్యాడు విశాల్‌. ‘‘ఆ ఘటనలో ఆమె తప్పు ఉందని నేను అనుకోవడంలేదు. ఆమె వ్యభిచారం చేస్తే, ఆ కేసులో ఆమెతో పట్టుబడ్డ వ్యక్తి కూడా ప్రాచుర్యం పొందాలి కదా’’ అని ప్రశ్నించిన విశాల్‌, తన సినిమాలో శ్వేతా బసు ప్రసాద్‌కి అవకాశం కల్పిస్తానని ప్రకటించాడు ఇదివరకే.

తన సినిమా ‘హైదర్‌’ రిలీజ్‌ సందర్భంగా కూడా శ్వేతా బసు ప్రసాద్‌ విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ, ఆమె బయటకు వచ్చాక, ఆమెకు తన సినిమాలో అవకాశం కల్పిస్తానని విశాల్‌ భరద్వాజ్‌ చెప్పాడు. శ్వేతకు నాతోపాటు ప్రముఖులు చాలామంది సంఫీుభావం ప్రకటించారు. అలా ఆమెకు మానసిక ధైర్యాన్నిచ్చినవారికి అభినందనలు తెలుపుతున్నానన్నాడు విశాల్‌.

ఇప్పటివరకూ అయితే విశాల్‌, శ్వేతకు అవకాశమిస్తానన్న మాటకే కట్టుబడి ఉన్నాడు. వివాదం ముగిసి, శ్వేత బయటకు వచ్చి, ఆమె విశాల్‌ సినిమాలో నటిస్తే, విశాల్‌ మాట నిలబెట్టుకున్నట్లవుతుంది, శ్వేత కూడా కెరీర్‌లో నిలదొక్కుకున్నట్లవుతుంది. ఆ రోజు అతి కొద్ది రోజులలో వస్తుందని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
small screen big wonders