Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vishal stand by promise

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

స్మాల్‌ స్క్రీన్‌, బిగ్‌ వండర్స్‌

small screen big wonders

సినిమా తారలు ట్రెండ్‌ మార్చి టీవీ స్క్రీన్‌పైన కూడా దర్శనమిస్తున్నారు. హేమాహేమీలు కూడా టీవీల్లో కన్పించడం ద్వారా కొత్త ఇన్నింగ్స్‌ని కొనసాగించడమో, లేదంటే గాడి తప్పిన ఇన్నింగ్స్‌ని గాడిన పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. ‘ఇంద్ర’, ‘ఖడ్గం’ చిత్రాల  హీరోయిన్‌ సోనాలి బింద్రే కూడా టీవీ స్క్రీన్‌పై అది కూడా టెలీ సీరియల్‌లో నటించేస్తుంది.

బిగ్‌ స్క్రీన్‌ నుంచి స్మాల్‌ స్క్రీన్‌కి అంటే తగ్గిపోవడమే కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, స్మాల్‌ స్క్రీన్‌ అయినా టీవీ ఇప్పుడు వండర్స్‌ సృష్టిస్తోందని సోనాలి నవ్వుతూ వెల్లడిరచింది. టీవీల్లో రియాల్టీ షోస్‌ చూస్తే, సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఎంత గొప్ప పేరున్న హీరో హీరోయిన్లు చేసిన డాన్సులైనా బలాదూర్‌ అన్పిస్తాయని డాన్స్‌ షోలకు జడ్జిగా పనిచేసిన అనుభవంతో చెప్పింది సోనాలి బింద్రే. సిల్వర్‌ స్క్రీన్‌కి వెళ్ళడానికి స్మాల్‌ స్క్రీన్‌ ఓ మెట్టుగా ఉపయోగపడ్తుందనేది సోనాలి బింద్రే అభిప్రాయమట. టీవీ సీరియల్‌లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానే తప్ప, స్థాయిని తగ్గించుకున్న భావన కలగడంలేదట ఆమెకి. స్మాల్‌ స్క్రీన్‌పై బిగ్‌ వండర్‌కి రెడీ అయిన సోనాలి బింద్రేకి బెస్ట్‌ విషెస్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam