Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

గోవిందుడు అందరివాడేలే: చిత్ర సమీక్ష

govindudu andarivadele movie review

చిత్రం: గోవిందుడు అందరివాడేలే
తారాగణం: రామ్‌చరణ్‌, కాజల్‌, శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రెహ్మాన్‌, ఆదర్శ్‌, కోట శ్రీనివాసరావు, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు
చాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: బండ్ల గణేష్‌
విడుదల తేదీ: 1 అక్టోబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
విదేశంలో సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న అభిరామ్‌, తన తండ్రి (రెహమాన్‌) మానసిక సంఘర్షణ గురించి తెలుసుకుంటాడు. దానికి కారణం, తన తండ్రి, తన తాతయ్య బాలరాజు (ప్రకాష్‌రాజ్‌) నుంచి వేరుపడటమేనని తెలుసుకున్న అభిరామ్‌, తండ్రిని, తాతయ్యనీ ఒక్కటి చేసేందుకు స్వదేశానికి వస్తాడు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడ్డ అభిరామ్‌, పల్లెటూరి నేపథ్యంలో ఎలా ఇమడగలిగాడు? ఈ పయనంలో తారసపడ్డ సత్య (కాజల్‌)తో ప్రేమాయణం ఏమయ్యింది? విదేశం నుంచి స్వదేశానికొచ్చి, తన కుటుంబాన్ని ఎలా ఆనందమయం చేశాడు.? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
చరణ్‌ చేసిన సినిమాల్లో చాలామటుకు మాస్‌ సినిమాలే. ‘ఆరెంజ్‌’ సినిమాతో డిఫరెంట్‌గా కన్పించే ప్రయత్నమైతే చేసినా అది నిరాశపరిచింది. కానీ నటుడిగా ఆ సినిమా చరణ్‌లో కొత్త కోణం చూపింది. అలా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా నటుడిగా చరణ్‌లోని డిఫరెంట్‌ యాంగిల్‌ని చూపింది. చరణ్‌ కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఒదిగిపోయాడు. సెంటిమెంట్‌ని పండిరచాడు. డిఫరెంట్‌ చరణ్‌ కనిపించాడు ఈ సినిమాలో. కాజల్‌ అందంగా కనిపించింది. గ్లామర్‌ పాళ్ళూ ఎక్కువగానే ప్రదర్శించింది. నటన పరంగానూ ఆకట్టుకుంది. తాతయ్య పాత్రలో ప్రకాష్‌రాజ్‌ కొన్ని సన్నివేశాల్లో చెలరేగిపోతే, సహజ నటి జయసుధ తన పేరును మరోమారు సార్ధకం చేసుకుంది. శ్రీకాంత్‌ నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రతో ఆకట్టుకుంటాడు. అక్కడక్కడా అతని పాత్ర నవ్వులు తెప్పిస్తుంది. కమలినీ ముఖర్జీ తక్కువ నిడివి వున్న పాత్రలోనే అయినా ఆమె పాత్ర కూడా రిజిస్టర్‌ అయ్యింది. తన పాత్రకు న్యాయం చేసింది. కోట శ్రీనివాసరావు, రెహమాన్‌, రావు రమేష్‌ తదితరులంతా తమ పాత్రల పరిధి మేర నటించారు. ఆదర్శ్‌ ఓకే. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి మంచి క్లాస్‌ లుక్‌ని తెచ్చాకి. నిర్మాణపు విలువలు సూపర్బ్‌. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా అందంగా రూపొందిందంటే దానిక్కారణం సినిమాటోగ్రఫీ. దర్శకుడు పాత తరం కథనే ఎంచుకున్నాడు. అయితే ఫ్యామిలీ సినిమా కావడంతో, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేశాడు దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కాస్త తగ్గింది. సెంటిమెంట్‌ పాళ్ళు పెరిగాయి. కథనంలో కొత్తదనం కన్నా ఎమోషనల్‌ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. తద్వారా టార్గెట్‌ ఆడియన్స్‌ని మెప్పించినా, చరణ్‌ సినిమాలకు రాజపోషకులైన మాస్‌ ఆడియన్స్‌ కొంచెం ఇబ్బంది పడతారు. అయితే హీరో రామ్‌చరణ్‌ ఇప్పటిదాకా కెరీర్‌లో చూపించని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూపించగలిగాడు. నటుడిగా సత్తా చాటుకోవాలంటే ఇలాంటి సినిమాలు రామ్‌చరణ్‌కి తప్పనిసరి.
ఫస్టాఫ్‌ అంతా స్మూత్‌గా సాగిపోతుంది. కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌, కొంచెం రొమాన్స్‌, ఇంకాస్త యాక్షన్‌ ఇలా అంతా కలగలిసి ముందుకు వెళుతుంది. సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువయ్యాయి. వాటిల్లో కొన్ని హార్ట్‌ టచ్చింగ్‌గానూ వున్నాయి. సెకెండాఫ్‌లో ఇంకొంచెం ఎంటర్‌టైనింగ్‌గా వుంటే సినిమా మాస్‌ ఆడియన్స్‌ని కూడా బాగా మెప్పించగలిగేది. అయినప్పటికీ ఫ్యామిలీ మూవీ కావడంతో స్లోగా బాక్పాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించేందుకు అవకాశాలెక్కువే ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
హార్ట్‌ టచ్చింగ్‌ గోవిందుడు

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with ram charan tej