Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chillara

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 16 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తలపెట్టిన ప్రయత్నాలు మున్డుకువేల్లుతకు అవకాశం కలదు. ఉద్యోగంలో నూతన మార్పులకు అవకాశం కలదు అవి మీలో కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దలనుండి వచ్చు సూచనల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కలదు. వ్యతిరేక వర్గం నుండి నూతన సమస్యలు వచ్చి పడుతాయి సర్దుబాటువిధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. వాహనములను నడుపునపుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.

 

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో చర్చలు జరుపుటకు అవకాశం ఉంది వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేపడుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తిచేస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీయొక్క ఆలోచనలు మంచి ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. సోదరవర్గంతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటికి సమయాన్ని ఇస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సర్దుబాటులు అవసరం లేకపోతే మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది.     

 

    

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద బంధుమిత్రులను కలుస్తారు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం ప్రయాణం చేయుటకు అవకాశం కలదు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి మేలుజరుగుతుంది. కుటుంబంలో కొన్ని కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు మీయొక్క ఆలోచనలు కొనమందికి నచ్చకపోవచ్చును. నూతన పరిచయాలు కలుగుతాయి వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇష్టమైన వారినుండి సహాయసహకారాలు లభించుట వలన నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది.   

 

 

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను మొత్తంమీద విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన చక్కటి గుర్తింపును పొందుతారు. మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చిననాటి మిత్రులతో సమయన్ని సరదాగా గడుపుతారు. కుటుంబసభ్యుల నుండి వచ్చు సూచనల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో లబ్దిని పొందుటకు అవకాశం ఉంది అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి పెద్దల లేక అనుభవజ్ఞుల సలహలను పాటించుట ఉత్తమం. జీవితభాగస్వామికి సంభందించిన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.   

 

 

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనుల్లో అనుకున్న ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి అభినందనలు పొందుతారు వారికీ అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. తలపెట్టిన ప్రయాణాలు సానుకూలంగా సాగుటకు అవకాశం ఉంది కావున నూతన ప్రయత్నాలు చేపట్టుట మంచిది. మిత్రుల నుండి వచ్చు సూచనల విషయంలో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారంలో బాగుంటుంది సమయాన్ని అధికంగా కార్యచరనకు ఇవ్వడం వలన మరింత ఆశించిన ఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు. పెద్దలనుండి లేక దూరప్రదేశం నుండి వచ్చు పనుల విషయంలో మాత్రం ఒత్తిడి తప్పకపోవచ్చును.   

 

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద పెద్దల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారికి అనుగుణంగా తీసుకొనే నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు మిత్రులతో కలిసి వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నూతన ఆలోచనలు చేస్తారు అలాగే దూరప్రదేశ ప్రయత్నాలు చేయుట అనేది సూచన. గట్టిగా స్రమించుట ద్వార ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం కలదు. కుటుంబంలో సభ్యులతో కలిసి మెలిసి ఉండే ప్రయత్నం చేయుట మంచిది కోపం తగ్గించుకోవడం వలన నష్టం తగ్గుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. స్వల్ప ఆరోగ్యసమస్యలు తప్పకపోవచును కావున తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది.    

 

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద నలుగురిలో మీరు చేపట్టిన పనుల మూలాన మేలుజరుగుతుంది తోటివారికి ఉపయోగపడే ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట సూచన అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మూలాన మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన లేకపోతే స్వల్ప ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో బద్ధకం వీడటం అలాగే లక్ష్యంను అశ్రద్ద చేయకండి శ్రమను పొందుట వలన మేలుజరుగుతుంది. కోపం మూలాన అనుకోని ఇబ్బందులు పొందుతారు కావున సాధ్యమైనంత వరకు తగ్గిచుకొనే ప్రయత్నం చేయండి.   

 

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద మిత్రులతో కలిసి లేక నచ్చిన వారితో కలిసి సమయాన్ని సరదాగా మీకు నచ్చిన విధంగా గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన విధంగా ఫలితాలు రావడం వలన సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. సమయానికి భోజనం చేయుట అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అనుభవజ్ఞుల సూచనలను అశ్రద్ద చేయకండి వాటిని పాటించే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది కాకపోతే అందరిని సంప్రదించుట వలన మేలుజరుగుతుంది ఇబ్బందులు తగ్గుటకు అవకాశం కలదు

 

ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ధనమునకు సంభందించిన విషయాల్లో ఊహించిన దానికన్నా అధికంగా ఖర్చులు అవుటకు అవకాశం కలదు కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది అలాగే వాహనముల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిచుట ఉత్తమం. ఒకవార్త మీలో నిరుత్సహంను పెంచుటకు అవకాశం కలదు కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది కాకపోతే ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబంలో జీవితభాగస్వామితో చర్చలు చేయకండి నిదానంగా వ్యవహరించుట మేలు మౌనం సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.     

 

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద సమాజసేవ కార్యక్రమలో పాల్గొనే అవకాశం ఉంది తద్వార నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. ఒకవార్త మిమ్మల్ని భాధకు గురిచేస్తుంది అశుభవర్తను వినే అవకాశం ఉంది.  వాహనముల మూలాన ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త, ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. పెద్దల సూచనల మేర నడుచుకుంటే తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగంలో సమయపాలన మేలుచేస్తుంది తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. రాజకీయరంగాల్లో మక్కువను కలిగిబ్ ఉంటారు కాకపోతే వాటికోసం సమయం వ్యర్థం చేసుకోకండి.        

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టు విషయంలో మానసికంగా తర్జన భర్జన ఉంటుంది పెద్దల సూచనలతో మంచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను చివరకు విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉన్ది. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం అనుకున్న విధంగా ఫలితాలు రావడం చేత సంతృప్తిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో శ్రమతప్పక పోవచ్చును నిదానంగా వాటిని పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. బంధువుల విషయంలో మాత్రం తగిన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనవసరమైన సమస్యలను తగ్గించుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగినజాగ్రత్తలు తీసుకోండి. 

 

మీన రాశి

ఈ వారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో కలిసి తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే ఆస్కారం కలదు,ఈ విషయంలో సహనం పాటించుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో పెద్దలనుండి సమాచరం తెల్సుకొనే అవకాశం ఉంది వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మాటను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన పనులను పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదావేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదు కొంతకాలం ఆగడం ఉత్తమం.   

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Gas Trouble | Ayurvedic Tips | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)