Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మళ్ళీ చరణ్‌, కృష్ణవంశీ కాంబినేషన్‌

once more charan and krishnavamshi combination

రామ్‌చరణ్‌ వరుస మాస్‌ కమర్షియల్‌ సినిమాలకు కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’తో బ్రేకిచ్చాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ని చరణ్‌తో చేసి మెప్పించిన కృష్ణవంశీ, చరణ్‌ని ఫ్యామిలీ హీరోగా మార్చేశాడు. కృష్ణవంశీతో చరణ్‌ సినిమా చేయడంతోనే చరణ్‌ టేస్ట్‌ అర్థమైంది. చరణ్‌ అంచనా కూడా నిజం అయ్యింది. ‘గోవిందుడు అందరివాడేలే’ మంచి కమర్షియల్‌ విజయం కూడా సాధించింది.

చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం కృష్ణవంశీ సొంతం. ఎప్పుడో చిరంజీవితో కృష్ణవంశీ సినిమా చేయాల్సి వున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. చిరంజీవితో సినిమా చేయలేకపోయినా, ఆయన తనయుడితో సినిమా చేసి మెప్పించాడు కృష్ణవంశీ. ఇంకోసారి చరణ్‌తో సినిమా చేసే అవకాశం వుందంటూ అభిమానులకు కృష్ణవంశీ మరో తీపి కబురు అందించాడు.‘ఎప్పుడు ఆ సినిమా వుంటుందో చెప్పలేనుగానీ ఖచ్చితంగా వుంటుంది’ అని చెప్పిన కృష్ణవంశీ, ఈసారి ఫ్యామిలీ సినిమా చేయనని, మళ్ళీ కొత్తగా వుండే కాన్సెప్ట్‌తోనే, చరణ్‌కి ఇంకా అద్భుతంగా ప్రెజెంట్‌ చేసే కథతోనే ఆ సినిమా చేస్తానన్నాడు. తన ఇమేజ్‌ని మార్చేసిన కృష్ణవంశీతో సినిమా చేయడానికి చరణ్‌ ఎప్పుడూ రెడీగానే వుంటాడు కాబట్టి, ఆ సినిమా వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి రావొచ్చేమో చూడాలిక.
 

మరిన్ని సినిమా కబుర్లు
competion between glamarous aunties