Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
once more charan and krishnavamshi combination

ఈ సంచికలో >> సినిమా >>

గ్లామరస్‌ ఆంటీల పోటీ

competion between glamarous aunties

‘అత్తారింటికి దారేది’ సినిమా హిట్‌తో నదియాకి డిమాండ్‌ పెరిగింది. ‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా, మధ్య వయస్కురాలైన మహిళగా మీనా కనిపించి మెప్పించింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ద్వారా ఇంద్రజ మళ్ళీ తెరపై కనిపించింది. ఇంకా మరికొంతమంది సీనియర్‌ హీరోయిన్లు వెండితెరపై తమ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక, అక్క వదిన వంటి పాత్రలకు తప్ప, తల్లి పాత్రల్లోనో, ఆంటీలుగానే కనిపించడానికి వెంటనే సిద్ధపడేవారు కాదు. కాని ఇప్పుడు సీనియర్‌ నటీమణుల ఆలోచనలు మారాయి. కొత్త కొత్త కథాంశాలతో సినిమాలూ వస్తున్నాయి. అందుకనే ఇదివరకటిలా కాకుండా, కొత్తగా ఆలోచిస్తున్నారు వారంతా. అలా ఆలోచించడంతో వెండితెర కళకళ్ళాడుతోంది సీనియర్‌ హీరోయిన్లతో.

నదియా, మీనా, ఇంద్రజ.. గ్లామర్‌ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా వున్నారు. స్టయిల్‌గా నదియా ‘అత్తారింటి దారేది’ సినిమాలో కన్పిస్తే, మీనా ‘దృశ్యం’ సినిమాలో అద్భుతమైన నటనటతో ఆకట్టుకుంది. ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలో ఇదివరకటి అందాన్ని రెట్టింపు చేసుకుని దర్శనమిచ్చింది ఇంద్రజ. సినిమా రిలీజ్‌ అవడానికి ముందే ఇంద్రజకు ఆఫర్లు వెల్లువెత్తాయట. ఒకనాటి గ్లామరస్‌ హీరోయిన్స్‌ ఇప్పుడు ఆంటీలుగా మారి తెలుగు తెరకు కొత్త అందాన్నిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
shanker never cares all like that