Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shanker never cares all like that

ఈ సంచికలో >> సినిమా >>

వంద కోట్ల సినిమా ఎప్పుడొస్తుంది?

when is the movie of  100crores budget...

మహేష్‌ కొట్టలేదు, చరణ్‌ సాధించలేదు. వంద కోట్ల తెలుగు సినిమా ఇంకా నేలకు దిగిరావడానికి ఎంత టైమ్‌ పడుతుందో తెలియడంలేదు. తృటిలో ‘అత్తారింటికి దారేది’ సినిమా వంద కోట్ల మార్క్‌ని దాటలేకపోయింది. వాస్తవానికైతే ‘1’ సినిమాపైనే వంద కోట్ల సినిమా అనే అంచనాలు వ్యక్తమయినప్పటికీ ఆ సినిమా పరాజయం పాలయ్యింది.ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి చూస్తే, ఈ సీజన్‌లో వంద కోట్ల సినిమా వచ్చే అవకాశం లేదని చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ మహేష్‌ లేదంటే చరణ్‌, వీరిద్దరూ కాదంటే పవన్‌కళ్యాణే వంద కోట్ల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి.

‘గబ్బర్‌సింగ్‌ 2’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటే ఆ సినిమాపై అంచనాలుంటాయి. ఇక్కడ ‘బాహుబలి’ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ చిత్రాలుగా వస్తున్న వాటిల్లో బాహుబలి’, ‘రుద్రమదేవి’ ఉన్నాయి. రాజమౌళి, గుణశేఖర్‌ తెలుగు సినిమా స్థాయిని పెంచేస్తామనే ధీమాతో ఈ సినిమాల్ని రూపొందిస్తున్నారు. వీటిపై భారీ అంచనాలు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో వంద కోట్లు సాధించే సినిమా రాకపోయినా, 2015 ఖచ్చితంగా ఆ ఘనతనకు వేదికవుతుంది. లెట్స్‌ వెయిట్‌ ఫర్‌ దట్‌.

మరిన్ని సినిమా కబుర్లు
director son coming as hero