Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : నూకరత్నం బావలు తలోమాట అంటూంటే రెచ్చిపోయి తానూ ఎదురు తిరుగుతుంది నూకరత్నం...ఈలోగా ఏకాంబర్ చెల్లి నిశ్చితార్థానికి ఆహ్వానించడానికి తన తల్లిని తీసుకుని వీళ్ళ ఇంటికి వస్తాడు. ఇక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు....ఏకాంబర్ ని పోల్చుకుని పలకరిస్తారు అందరూ. ..........................................................

ఏకాంబర్ కూడా అన్న నీలాంబర్ ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. పూనే నుండి వచ్చిన దగ్గరనుండి అలాగే ఉంటున్నాడు.

నూకరత్నం కూడా ఓ దగ్గర కూర్చోకుండా అలివేలుమంగ దగ్గరే వుండి ఆమె అలంకరణతో పాలుపంచుకుంటోంది.

ఏకాంబర్, నూకరత్నం అనుకోకుండా ఎదురుపడితే చిన్నగా నవ్వేసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

పది గంటలయ్యేసరికి పెళ్ళివారు బస్సులోనూ, కార్లలోనూ కళ్యాణ మండపం దగ్గరకు చేరుకున్నారు.

పెళ్ళి ఏర్పాట్లన్నీ ఘనం గా నిర్వహించడం చూసి పెద్దవాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. పీతాంబరం తో పెళ్ళికొడుకు తండ్రి అదేమాట అనేసాడు.

కట్నం తక్కువనిపించినా బావగారూ! తాంబూలాల ఏర్పాట్లే ఇంత ఘనం గా చేస్తున్నారు. రేపు పెళ్ళి ఎంత అదరగొడతారో అనిపిస్తోంది. అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

అంటే మా చిన్నోడి ఏర్పాట్లండీ! నాదేముంది..వాడికి చెల్లంటే ప్రాణం అన్నాడు పీతాంబరం.

తాంబూలాలు అయ్యి మధ్యాహ్నం బోజనాలు పూర్తయ్యాక  ఇరుపక్షాల వియ్యాల వారు కలిసి ముహూర్తాలు పెట్టుకోవడానికి బ్రాహ్మణ వీధికి వెళ్ళారు. కాళిదాసు పండితున్ని కలిసి పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయించాక మగపెళ్ళివారు కదిలి వెళ్ళారు.

నూకరత్నం వాళ్ళు అంతవరకూ ఏకాంబరం అమ్మగారికి సహాయాం గా వుండిపోయారు. నూకరత్నం ఇద్దరు బావలు సతీసమేతం గా విచ్చేసారు.

ఏకాంబర్ మాత్రం మధ్య మధ్యలో నూకరత్నాన్ని ఓరకంట చూస్తూ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ తల్లి గాని, చెల్లిగాని, తండ్రి గానీ చూస్తే సిగ్గుపడి పారిపోతున్నాడు.

నూకరత్నం కూడా పెళ్ళికూతురిలా ముస్తాబై వచ్చింది. ధగధగా మెరిసే చీరలో వాలు జడ ఊపుకుంటూ సంబరం అంతా నాదే అన్నట్టు కళ్యాణ మండపమంతా కలియతిరిగేది.

నూకరత్నాన్ని చూసి ఏకాంబరం బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఆరా కూడా తీసేవారు.

ఆ తాంబూలాల వేడుకలో గమ్మత్తైన విషయం నూకరత్నం కంట పడింది.

ఉద్యోగం పోయిందన్న విచారం లో ఉన్న నీలాంబర్ చుట్టూ అలివేలుమంగ స్నేహితురాళ్ళతో ఒక అమ్మాయి పదేపదే తిరగడం గమనించింది. మౌన మునిలా కూర్చున్న నీలాంబర్ కూడా తన ప్రక్కనే తిరుగుతూ టైం ఎంతయిందనో, వాళ్ళేరండి? వీళ్ళేరండి? అనో ప్రశ్నిస్తూ వుండడం ఆమె వాలకం ఓరకంట గమనిస్తూనే వున్నాడు.

అదే విషయం భోజనాలు వడ్డిస్తున్నప్పుడు ఏకాంబర్ తో చెప్పింది నూకరత్నం. అప్పుడు కూడా భోజనం చేస్తున్న నీలాంబర్ కే ఆ అమ్మాయి కొసరి కొసరి వడ్డిస్తూ అటూ ఇటూ తిరగడం ఏకాంబర్ కి చూపించింది.

ఓ ఆ అమ్మాయా? మంగ స్నేహితురాలే కాదు మాకు దూరపు బంధువు కూడా, అమ్మకి వేలు విడిచిన అన్నయ్య కూతురు. పోనీలే ఈ విధంగా నైనా నీలాంబర్ మనలో పడుతాడు నవ్వుతూ అన్నాడు.

నూకరత్నం, ఏకాంబర్ లే కాదు ఆ అమ్మాయి నీలాంబర్ చుట్టూనే తిరగడం పీతాంబర్ కూడా ఓరకంట గమనించాడు. భార్య పర్వతాలుతో కూడా చెప్పి గమనించమన్నాడు.

ఆ అమ్మాయి పీతాంబరం, పర్వతాలుకి బాగా నచ్చేసింది చూద్దాం. భగవంతుడు కూడా రాసి పెట్టాలి కదా! అన్నుకున్నారిద్దరూ.తాంబూలాలు అయిన ఆరునెలల తరువాత పెళ్ళి ముహూర్తం ఖరారయింది. అంత సమయం దొరికితే ఆర్ధికం గా కూడా సర్దుకోవచ్చనుకున్నాడు పీతాంబరం.

ఆ నెల్లోనే నీలాంబర్   చేత కంప్యూటర్ సెంటర్ పెట్టించాడు ఏకాంబర్. దానికి కావలిసిన షాపు కూడా గోపాలపట్నం లోనే తండ్రి డిపార్ట్ మెంట్ స్టోర్ పక్కనే చూసాడు. ఫర్నిచర్లకి, కంప్యూటర్లకి నూకరత్నం ద్వారా బ్యాంకు లోను సంపాదించాడు. ఆ బ్యాంకు రుణానికి ఏకాంబరే జామీన్నుగా వుండు ఇప్పించాడు.

మొదట షాపు దొరకలేదు. అడ్వాన్స్ ఎక్కువ అడిగారు. ఏం చేయాలో ఏకాంబర్ కి అర్ధం కాలేదు. షాపు లేకపోతే బ్యాంకు లోను కూడా మంజూరు కాదు.

తండ్రికి, తల్లికి ఈ విషయం వివరించాడు. అప్పుడు పీతాంబరే మన డిపార్ట్మెంట్ షాపు తీసేసి అన్నయ్యకి ఇచ్చేస్తాన్రా! అని ముందుకు వచ్చాడు. దానికి ఏకాంబర్ అంగీకరించలేదు.

మీరు మీ షాపు మూసేసి ఇంట్లో కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. రోజూ ఏదో పని చేసే మీరు ఖాళీగా వుండలేరు వద్దు అంటూ బోధపరిచాడు.

నిజమేనండి! చిన్నోడు చెప్పింది కరక్టే! అమ్మినా అమ్మకపోయినా షాపు తెరచి కూర్చోవడం వలన మనసు వుంటుంది. శరీరానికి కూడా పని దొరుకుతుంది. చూద్దాం! ఎక్కడో ఒక దగ్గర పెద్దోడికి షాపు దొరక్కపోదు. అంది పర్వతాలు.

నెల తిరక్కుండానే

అదే రోడ్డు లో నాలుగైదు షాపుల దూరం లో షాపు ఖాళీ అవుతోందని తెలియగానే పరుగుపరుగున వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి ఖరారు చేసుకున్నాడు ఏకాంబర్.

నీలాంబర్ షాపు తెరిచిన వేళా విశేషమో కానీ తాంబూలాలలో చ్హూసిన అమ్మాయితోనే నీలాంబర్ కి పెళ్ళి కూడా కుదిరిపోయింది.నీలాంబర్ కి పెళ్ళి కుదరడం ఎక్కువగా ఏకాంబర్ కి సంతోషం కలిగించింది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా తిరిగే నీలాంబర్ కూడ కంప్యూటర్ సెంటర్ ప్రారంభించగానే విధ్యార్ధులతో మమేకమై రాత్రి, పగలు అదే ధ్యాసలో వున్నాడు. విధ్యార్ధులు కూడా నీలాంబర్ కంప్యూటర్ సెంటర్ లో జాయిన్ అవడానికి క్యూ కడుతున్నారు. ఏకాంబర్ తల్లి తండ్రులు పీతాంబర్, పర్వతాలు కూఅడా చాలా సంబరపడిపోతున్నారు. కూతురి పెళ్ళి అయిపోయింది. పెద్దోడి సంబంధం కూడా కుదిరిపోయింది. అమ్మాయి పెళ్ళయితే గానీ మిగతా విషయాలు మాట్లాడ్డం కుదరదని నిక్కచ్చిగా చెప్పేసింది పర్వతాలు.

అలివేలు మంగ పెళ్ళయ్యేకే ఇద్దరన్నదమ్ములకీ ఒకేసారి చేద్దామని పర్వతాలు ఆలోచన, దానికి పీతాంబర్ కూడా సుముఖం గానే వున్నాడు. నీలాబర్ అత్తవారు కూడా మీ ఇష్టం

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana