Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nikhil

ఈ సంచికలో >> సినిమా >>

పూజ: చిత్రసమీక్ష

pooja movie review

చిత్రం: పూజ
తారాగణం: విశాల్‌, శృతిహాసన్‌, సత్యరాజ్‌, ముఖేష్‌ తివారీ, రాధిక, సూరి, జయప్రకాష్‌, తలైవాసల్‌ విజయ్‌, ప్రతాప్‌ పోతన్‌, పాండి, సితార, అభినయ తదితరులు
చాయాగ్రహణం: ప్రియన్‌
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాణం: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
దర్శకత్వం: హరి
నిర్మాత: విశాల్‌
విడుదల తేదీ: 22 అక్టోబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
వడ్డీ వ్యాపారం చేసుకుంటూ వుంటాడో విశాల హృదయం వున్న ఓ యువకుడు వాసు (విశాల్‌). ఓ సందర్భంలో పోలీస్‌ అధికారి (సత్యరాజ్‌)ని వాసు కాపాడతాడు. అలా విలన్‌ తాండవమ్‌ (ముఖేష్‌ తివారీ)కి శతృవవుతాడు వాసు. ఇంకోపక్కన వాసు, దివ్య (శృతిహాసన్‌) అనే యువతితో ప్రేమలో పడ్తాడు. వాసు బ్యాక్‌గ్రౌండ్‌ గురించి పూర్తిగా తెలియదు దివ్యకి. కొన్ని సందర్భాలు తాండవంతో వాసు తలపడేలా చేస్తాయి. వాసుకీ, తాండవమ్‌కీ ముందు నుంచీ గొడవ నడుస్తుంటుంది. ఆ గొడవ ఏంటి? ఎందుకు? మళ్ళీ వాసుకీ, తాండవమ్‌కీ మధ్య తలెత్తిన వివాదంలో ఎవరు పైచేయి సాధించారు? అన్నది తెరపై చూడాల్సి ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
హీరోగా విశాల్‌ ఎనర్జిటిక్‌గా కన్పించాడు. డాన్సుల్లో హుషారుగా, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో పవర్‌ఫుల్‌గా కన్పించడమే కాక, సినిమాలో సన్నివేశాలకు తగ్గట్టుగా నటనా ప్రతిభను చూపించాడు. ఓవరాల్‌గా విశాల్‌ నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు. హీరోయిన్‌ శృతిహాసన్‌ గ్లామర్‌కే పరిమతమైంది. ఆమె తెరపై కన్పించినంతసేపూ గ్లామరస్‌గానే ఉంది. నటన పరంగా ఓకే. విలన్‌గా ముఖేష్‌ తివారీ అద్భుతంగా నటించాడు. రాధిక నటన గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. అయితే దర్శకుడు ఇంకా ఆమె పాత్రను సరిగ్గా వాడుకోవాల్సింది. సత్యరాజ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తన పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయాడు. సూరి, పాండి నవ్వులు పూయించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. పాటలు పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటలు సినిమాకి ప్లస్‌ అవలేదు. సినిమాటోగ్రఫీ చాలాబాగుంది. సినిమాకి రిచ్‌నెస్‌ తెచ్చింది. కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి తగ్గట్టున్నాయి. స్క్రీన్‌ప్లే ఇలాంటి సినిమాలకు ఆయువు పట్టు. కానీ ఆ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. డైలాగ్స్‌ బాగానే వున్నాయి. దర్శకుడు రొటీన్‌ కథనే ఎంచుకున్నాడు. ఎక్కడా అద్భుతాల్లేవు. ముందు ఏం జరగబోతోందో తెలిసిపోవడంతో సాదా సీదాగా అనిపిస్తుంటుంది. సినిమాని మాత్రం రిచ్‌గా తెరకెక్కించాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌పై దర్శకుడు తనకున్న పట్టును మరోసారి ప్రదర్శించాడు. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, రొమాన్స్‌తో సాగిపోతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌ మాత్రం బోరింగ్‌గా మారిపోయింది. సాగతీతకు గురైనట్లు కన్పిస్తుంది. తగిన స్క్రీన్‌ప్లే, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడిరచి వుంటే సినిమాకి ఇంకా మంచి రిజల్ట్‌ వచ్చి వుండేది. మాస్‌ ప్రియులకు కొంత బాగానే నచ్చుతుంది సినిమా. క్లాస్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అవడం కష్టమే.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ పూజ ఫర్వాలేదంతే.

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka