Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా మీద ప్యాషన్‌ ఇంకా పెరిగింది

my passion increased on movies

 సక్సెస్‌ ఇచ్చే కిక్కే వేరని ఆ కిక్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న ఢల్లీి బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చెప్పింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘లౌక్యం’ సినిమాలతో రెండు వరుస విజయాల్ని అందుకున్న రకుల్‌, ‘కరెంటు తీగ’, ‘రఫ్‌’ ఇంకా మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. షార్ట్‌ టైమ్‌లో ఆమె తెలుగు కూడా నేర్చుకుని ఆశ్చర్యపరుస్తోంది సినిమా వర్గాల్ని. అచ్చ తెలుగు హీరోయిన్లు కూడా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. తెలుగుని టెల్గు అనడం ప్యాషన్‌ అయిపోయింది. కాని రకుల్‌ అలా కాదు, తెలుగులో స్పష్టంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. ‘నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నాను కూడా’ అని తన కొత్త సినిమాల ప్రమోషన్‌ కోసం టీవీల్లోకొచ్చి చెప్పింది. గ్రేట్‌ అని అనకుండా ఉండలేం ఉత్తరాది హీరోయిన్లు తెలుగు మాట్లాడుతుండడాన్ని.

సినిమా మీద ప్యాషన్‌ ఉంటేనే ఇలా చేయగలరు ఎవరైనా. ‘ఆ ప్యాషన్‌ నాకు చాలా ఎక్కువ. అందుకే సినిమా కెరీర్‌ని ఎంచుకున్నాను’ అని చెప్పే రకుల్‌ ప్రీత్‌సింగ్‌, గ్లామర్‌ సినిమాలో భాగం అని, హద్దులు దాటని అందాల ప్రదర్శన సినిమాకి అందాన్ని తేవడంతోపాటు, తనకూ గుర్తింపునిస్తుందని అభిప్రాయం వెలిబుచ్చింది. హద్దులు దాటే ఎక్స్‌పోజింగ్‌కి తానెప్పుడూ వ్యతిరేకం అని ఆమె స్పష్టం చేసింది.

మరిన్ని సినిమా కబుర్లు
rough & tough boy looking hansome