Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
my passion increased on movies

ఈ సంచికలో >> సినిమా >>

‘రఫ్‌’ అండ్‌ టఫ్‌ కుర్రాడు బావున్నాడు

rough & tough boy looking hansome

కొత్తగా సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నవారు ఫుల్లుగా ప్రిపేర్‌ అయిపోతున్నారు. డాన్స్‌, యాక్షన్‌ విషయంలో ముందుగా శిక్షణ తీసుకోవడం ముఖ్యం అని భావించి, అలాంటి విభాగాల్లో కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. అలా వస్తున్న కొత్త తరం హీరోలు ముఖ్యంగా సిక్స్‌ప్యాక్‌ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

ఏ హీరో కొత్తగా వచ్చినా, అతని షర్ట్‌ వెనుక ఖచ్చింగా సిక్స్‌ ప్యాక్‌ ఉండే ఉంటోంది. అవసరాన్ని బట్టి కొందరు దాన్ని ప్రదర్శిస్తుంటే, కొందరు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. హీరో ఆది కూడా సమయం కోసం వేచి చూసి ‘సిక్స్‌ ప్యాక్‌’ ప్రదర్శించడానికి రఫ్‌గా రెడీ అయినట్లున్నాడు. అతని కొత్త సినిమా ‘రఫ్‌’ చాలా రఫ్‌గానే ఉండేలా ఉంది. సాయికుమార్‌ తనయుడు కదా, మాస్‌ పల్స్‌ తెలిసినోడు. అందుకే జాగ్రత్తపడ్డాడు.

లవర్‌ బాయ్‌ సినిమాలు ట్రై చేసిన ఆది, అవి చేస్తూనే మాస్‌పై ఫోకస్‌ పెట్టాడు. డాన్సింగ్‌ టాలెంట్‌ ఇప్పటికే బయటపెట్టిన ఆది, సిక్స్‌ ప్యాక్‌తో విలన్స్‌ భరతం పడ్తాడట ‘రఫ్‌’లో. బెస్టాఫ్‌ లక్‌ ఆది అని చెబుదామా?

మరిన్ని సినిమా కబుర్లు
super brother & sister