Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rough & tough boy looking hansome

ఈ సంచికలో >> సినిమా >>

ఈ అన్నా చెల్లెళ్ళు అదరహో

super brother & sister

అన్నా చెల్లెళ్ళు అంటే అనుబంధానికి ప్రతీక. ‘నీ పాదమ్మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ అనే పాట అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా వినిపిస్తుంటుంది. కాని ఈ అన్నా చెల్లెళ్ళు కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. అల్లరి నరేష్‌ని ఓ రాకెట్‌కి కట్టేసి, పేల్చేసింది కార్తీక. ఆగండాగండీ, ఇది సినిమా. సినిమాలో ఏం చేసిందోగానీ, ప్రచార చిత్రం అలా రూపొందించారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్‌ అంటే ట్రెండీగా ఉండాలి. అలాంటి ట్రెండీ ఆలోచనలు అల్లరి నరేష్‌ సినిమాలకు ఎక్కువగా వస్తుంటాయి.

‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ టైటిలే డిఫరెంట్‌గా వుంది. అందుకనే సినిమా ప్రమోషన్‌ కూడా డిఫరెంట్‌గా చేస్తున్నారు. కామెడీ హీరో అల్లరి నరేష్‌కి సోదరిగా కార్తీక నటిస్తుంది. అల్లరి నరేష్‌ అంటే ఫుల్‌ కామెడీ. అతనికే కితకితలు పెట్టి, షాక్‌ ఇచ్చేలా కార్తీక క్యారెక్టర్‌ ఉంటుందట. సినిమాలో ఎక్కువ భాగం కార్తీకదేనంట. గ్లామరస్‌ బ్యూటీ, అల్లరి నరేష్‌కి సోదరి అనగానే ఆశ్చర్యపోయారు కొందరు. ఆ ఆశ్చర్యం పదిందతలయ్యేలా సినిమా ఉంటుందని సమాచారమ్‌. బొమ్మాళీగా కార్తీక, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీగా అల్లరి నరేష్‌ చెలరేగిపోయారంట సినిమాలో. విడుదలకు ముందే ఈ టాక్‌ సంపాదించుకోవడంతో, సినిమాకి ఓపెనింగ్స్‌ అదరహో అనడం అతిశయోక్తి కాదు.

మరిన్ని సినిమా కబుర్లు
loss is first step  for victory