Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
super brother & sister

ఈ సంచికలో >> సినిమా >>

ఓటమి విజయానికి తొలిమెట్టు

loss is first step  for victory

కామెడీ నటి హేమ, రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. కాని రాజకీయ రంగ ప్రవేశంతో ఆమె తక్షణం విజయాన్ని పొందలేదు. మహామహులే రాజకీయాల్లో అపజయాలు చూశారు. ఓటమితో పాఠాలు నేర్చుకుని, ప్రజలకు దగ్గరయి, నాయకులుగా ఎదిగినవారు చరిత్రలో లెక్కలేనంతమంది కనిపిస్తారు. వారినే ఆదర్శంగా తీసుకుందట హేమ కూడా.

సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో ఎన్నికల ప్రచారం తనకు నేర్పిందని హేమ చెప్పారు. తమను చూడ్డానికి వచ్చినవారంతా ఓట్లు వేయరనే విషయం అర్థమయ్యిందనీ, అందుకనే ఇకపై ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ముందుగా ప్రజల వద్దకు వెళతానని అంటున్నారామె. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదని, అందుకనే వెతుక్కుంటూ వచ్చి టిక్కెట్‌ ఇచ్చేసరికి కాదనలేకపోయానని అన్న హేమ, ప్రచారానికి తగిన సమయం లేకపోవడం కూడా ఓటమికి కారణం కావొచ్చన్నారు.

వయసుకు మించిన పాత్రలు వేయడం వలన తన వయసు సినిమాల్లో పెరిగిపోయిందనీ, తన వయసు ఇంకా ఫార్టీస్‌కి వెళ్ళలేదని కూడా నిర్మొహమాటంగా వెల్లడిరచారామె. చక్కని నటనతో, టైమింగ్‌తో కూడిన పంచ్‌ డైలాగులతో ఆకట్టుకునే హేమ ఓటమి విజయానికి తొలిమెట్టు అనే నమ్మకంతో ఉన్నారు. ఆమె రాజకీయాల్లో కూడా రాణించే రోజు రావాలని విషెస్‌ చెబుదాం.

మరిన్ని సినిమా కబుర్లు
song her childhood ambition