Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
loss is first step  for victory

ఈ సంచికలో >> సినిమా >>

పాట.. ఆమెకి చిన్నప్పటికి కోరికట

song her childhood ambition

ముద్దు ముద్దుగా వుందీ ముద్దుగుమ్మ అని తొలి చిత్రంతో అనిపించుకున్న రాశి ఖన్నా, తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా యువ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. ‘జోరు’ అంటూ హుషారుగా చిందేసిన రాశి ఖన్నాకి పాటలు పాడటమంటే ఎంతో ఇష్టమట. చిన్నప్పటినుంచీ సింగర్‌ అవ్వాలని అనుకున్న రాశిఖన్నా, అనుకోకుండా హీరోయిన్‌ అయ్యానని చెప్పింది. కెరీర్‌ ఎలా మలుపులు తిరుగుతుందో ఊహించలేం అని వేదాంతం మాట్లాడ్డంలో కూడా రాశి ఖన్నా దిట్ట.

‘జోరు’ సినిమాలో సందీప్‌ కిషన్‌కి జోడీగా నటిస్తున్న ఈ భామ, ఈ సినిమాలోనే టైటిల్‌ సాంగ్‌ కూడా పాడిరది. తెలుగులో మాట్లాడటం రాకున్నా, చాలా ఇష్టంగా ‘జోరు..’ టైటిల్‌ సాంగ్‌ పాడటం జరిగిందని, ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పింది. ‘అనుకోకుండా జరిగేవే అద్భుతాలు.. నా పాట కూడా అలాంటి అద్భుతమే నాకు..’ అని అంటోన్న ఈ బ్యూటీ, చిన్నప్పటి కోరికను తీర్చుకునేందుకు సరదాగా పాట పాడిరదని అనుకోడానికి లేదు. ఎందుకంటే, ‘జోరు..’ పాట అంత జోష్‌గా, పక్కా ప్రొఫెషనల్‌గా ఆమె పాడిరది.

పాట పాడుతున్న సమయంలో వీడియో తీసి, సినిమా ప్రచారం కోసం వాడారు. యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ బ్యూటీ అయిన రాశి ఖన్నా, తొలి సినిమాలో మొద్దుగా, ముద్దుగా, బుద్ధిగా కనిపించినప్పటికీ, తాను చాలా స్పీడ్‌ అని గలగలా నవ్వేసింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam