Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
natyabharateeyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (అక్టోబర్31 నుండి నవంబర్ 6వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మీ పై అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో స్వల్ప పురోగతి ఉంటుంది కాకపోతే ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కొత్త కొత్త పరిచయాలు అవుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో నూతన నిర్ణయాలతో ముందుకువెళ్ళుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు మొండిగా తీసుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి నూతన ఆలోచనలకు శ్రీకారం  చుడుతారు.


వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. బంధువర్గం నుండి నూతన సమాచరం సేకరిస్తారు అలాగే సోదరవర్గంతో నూతన ఆలోచనల విషయంలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సరదాగ సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ఆస్కారం కలదు. వాహనముల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది కావున చాలావరకు నిర్ణయాలు తీసుకొనే ముందే ఆలోచనలు చేపట్టుట మంచది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయిన చివరకు విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలో పాల్గొనేటప్పుడు వారికి అనుగుణంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపరసంభందమైన విషయాల్లో పెద్దల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో సమయానికి ధనం అందుతుంది అనవసరమైన ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అనారోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద కుటుంబంలో ఆశించిన విధంగా నూతన మార్పులు రావడానికి ఆస్కారం కలదు. గతంలో చేపట్టిన పనులకు గాను మంచి  గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి అనుకూలంగా వ్యవహరించుట వలన కొన్ని కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టువిషయంలో మాత్రం తొందరపాటు వద్దు అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడుతాయి. ప్రయాణాల మూలాన కొంత శ్రమను అలాగే ఇబ్బందులను పొందుతారు కావున వీలైతే వాటిని వాయిదా వేసే ప్రయత్నం చేయుట ఉత్తమం.
 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద మొదట్లో ఉన్న సానుకూలత తర్వాత ఉండకపోవచ్చును. చేపట్టిన పనుల పట్ల అవగాహన అవసరం లేకపోతే ఇబ్బందులు తప్పవు. తలపెట్టిన ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టబడులు వద్దు గతంలో ఆరంభించిన లేక మొదలుపెట్టిన వాటిని కొనసాగించే ప్రయత్నం మంచిది. అధికారులతో కలిసి తీసుకున్న నిర్ణయాల్లో కొంత ఇబ్బందులు కలిగినను ఓర్పుతో ముందుకు వెళితే మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు నూతన సమస్యలు పొందుతారు కావున నిదానంగా వ్యవహరించుట మంచిది.
 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద వ్యతిరేకవర్గం నుండి సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయంలో ఒకలాంటి నిరుత్సాహం లేక అశ్రద్ద మిమ్మల్ని అవహరిస్తుంది కావున సమయాన్ని వృధాకాకుండా చూసుకోవడం మంచిది. స్త్రీ / పురుష సంభంద విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనులుఇ నిదానంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితాలకు అవకాశం ఉంది. ప్రణాళికాబద్దంగా ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి కావున గట్టిగాప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి నూతన్ ప్రయత్నాలు చేపడుతారు.
 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద కుటుంబంలో అనుకోని మార్పులకు అవకాశం ఉంది వాటి విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే అనవసరమైన ఖర్చుల విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది. బద్ధకం వీడి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దైవసంభంద విషయాల్లో సమయం గడుపుతారు.


వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనుల్లో శ్రమను పొన్దుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులనుండి శ్రమను అలాగే పనిభారం పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రుల నుండి వచ్చు సూచనల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది మీయొక్క మాటతీరును మార్చుకొనే ప్రయత్నం చేయండి. సోదరులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు విందులలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.
 

ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. నిదానంగా వ్యవహరించుట సూచన. ఫలితాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చును కావున సర్దుబాటువిధానం మంచిది. స్వల్పఆనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయస్పూర్తి అవసరం లేకపోతే నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులను చేపట్టుటలో విఫలం చెందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగించుకొనే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది సాధ్యమైతే వాటిని వాయిదా వేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.
 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది అలాగే చిననాటి మిత్రులను కలుస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు,మాటతీరు తోటివారిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. నలుగురిలో పనిచేసే సమయంలో వారికి అనుగుణంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన వార్తలను వినేఅవకాశం ఉంది సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. రాజకీయపరమైన విషయాల్లో పెద్దలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి.
 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద మిత్రులతో కలిసి గతంలో చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో ఫలితాలు నిదానంగా వచ్చుటకు అవకాశం ఉంది. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా ఉండే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు తోటివారిని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో కలిసి చేపట్టిన చర్చలు ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సమాజికకార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు తోటివారికి సహాయం చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు. మానసికంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది.
 

మీన రాశి

ఈ వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది తోటివారితో కలిసి చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్తారు. కుటుంబంలో మార్పులకు అవకాశం ఉంది వాటిని స్వాగతించుట మంచిది. సంతానపరమైన విషయల్లో సంతోషకరమైన వార్తలను వినే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevnam