Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

లారెన్స్‌కి అమ్మే దేవత

mother is god for lawrence

స్టార్‌ కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ రాఘవేంద్ర, దర్శకుడిగానూ ‘మాస్‌’, ‘కాంచన’ వంటి సినిమాలతో సత్తా చాటుకున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించిన లారెన్స్‌, ఎప్పుడు మాట్లాడినా తన తల్లి గురించి ప్రస్తావిస్తుంటాడు. తనను కష్టపడి పెంచిన తల్లి రుణం తీర్చుకోలేనిదని ఆవేదన చెందుతుంటాడతడు. ‘స్టైల్‌’ సినిమాలో తల్లి కోసం అతను పడే ఆరాటం నటనలా అనిపించదు. అది నిజమేనేమో అనిపిస్తుంది. తల్లి మీద అతనికి వున్న ప్రేమ అలాంటిది.

అమ్మ అంటే తనకి ఎంత ఇష్టమో, ఆమెను తానెంతగా ప్రేమిస్తానో, అభిమానిస్తానో తనకే తెలుసంటాడు లారెన్స్‌. అమ్మని దేవతలా భావించే లారెన్స్‌, తన తల్లి కోసం నిజంగా ఓ దేవాలయాన్నే నిర్మించనున్నట్లు చెప్పాడు. తన తండ్రి స్వస్థలం అయిన మేవలూర్‌కుప్పంలో తన తల్లికి దేవాలయం నిర్మిస్తున్నాడు లారెన్స్‌. విగ్రహం తయారీకి లారెన్స్‌ ఇప్పటికే ఆర్డర్‌ కూడా ఇచ్చాడు.

పుట్టినరోజు సందర్భంగా లారెన్స్‌ తన తల్లికి గుడి కడుతున్న విషయాన్ని వెల్లడిరచాడు. తల్లిని ప్రేమిస్తే ఏ బిడ్డకైనా మంచి జరుగుతుందనీ, తల్లే కనిపించే దైవం అని అన్నాడు లారెన్స్‌. తమిళనాడులో కొందరు హీరోయిన్లకు దేవాలయాలున్నాయి. వారి అభిమానం అలాంటిది. కానీ తల్లికి గుడి కట్టేవారెందరుంటారు?

మరిన్ని సినిమా కబుర్లు
tolywood got new beauty