Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
running cool

ఈ సంచికలో >> సినిమా >>

శ్వేతకు అండగా వుంటామన్నోళ్ళు ఎక్కడ

where the people who supported to shwetha

హీరోయిన్‌ శ్వేతా బసు ప్రసాద్‌ వివాదాస్పదంగా వార్తల్లోకి ఎక్కింది కొన్నాళ్ళ క్రితం. చేయకూడని పని చేసిందని ఆరోపిస్తూ ఆమెను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిస్తే కోర్టు ఆమెను రెస్క్యూహోమ్‌కి పంపింది. ఆమె తల్లి తన కుమార్తెను అప్పగించాల్సిందిగా కోరగా, మొదట ఆమె విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. ఇంకో కోర్టులో శ్వేతకు ఊరట కలిగింది. తప్పు అంటూ జరిగితే శ్వేతతోపాటు ఇంకో వ్యక్తి కూడా ఆ తప్పులో భాగమే. కాని ఆ వ్యక్తి దొరకలేదు. అతని పేరూ తెలియలేదు.

జరిగిందేదో జరిగిపోయింది. శ్వేతా బసు ప్రసాద్‌కి కష్ట కాలంలో మద్దతు పలికారు సినీ ప్రముఖుల్లో కొందరు పెద్ద మనసు ఉన్నవారు. ఆ పెద్ద మనసుతో ఆమెకు అవకాశాలు తమ సినిమాల్లో ఇస్తామన్నారు కూడా. ఓ బాలీవుడ్‌ దర్శకుడు శ్వేతకు మద్దతుగా మాట్లాడి, ఆమెతో ఓ సినిమా తీస్తానన్నాడు. తెలుగులోనూ కొందరు పెద్దలు శ్వేతకు మద్దతుగా మాట్లాడారు.

ఇదివరకు ఇలాంటి ఇబ్బందుల్లో కొందరు నటీమణులు ఇరుక్కున్నారు, బయటపడ్డారు కూడాను. ఓ మంచి హిట్‌తో కెరీర్‌ ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్‌, మళ్ళీ అలానే రీ`ఎంట్రీలో కూడా మంచి హిట్‌ సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పించి, ఆమెను హిందీలోనో, తెలుగులోనూ సినీ ప్రముఖులు ప్రోత్సహించాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
he dont want to kiss her