Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
where the people who supported to shwetha

ఈ సంచికలో >> సినిమా >>

ఆమెకయితే ముద్దివ్వనన్నాడు

he dont want to kiss her

ఒకానొక కాలంలో అడల్ట్‌ సినిమాలు చేసినా, హిందీ సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే సెటిలైపోయిన కెనడియన్‌ అడల్ట్‌ స్టార్‌ సన్నీలియోన్‌తో సినిమాలు చేయడానికి హిందీ సినిమా వాళ్ళే కాకుండా, తెలుగు సినిమాకు చెందినవాళ్ళు, తమిళ, కన్నడ సినిమాలకు చెందినవాళ్ళూ పోటీ పడుతున్నారు. సన్నీలియోన్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేయించినా సినిమాకి క్రేజ్‌ పెరుగుతుందని భావించేవారు ఎక్కువవడంతో ఆమెకు డిమాండ్‌ బాగా ఉంది.

కాని ఓ హిందీ హీరో సన్నీలియోన్‌తో సినిమా చేయనన్నాడు. అతను కూడా ఇంచు మించు అడల్ట్‌ సినిమాల్లాంటివే చేశాడు. ఇండియా వరకూ అతను నటించిన సినిమాలు అలాంటివే. ‘మర్డర్‌’ వంటి సినిమాల్లో నటించిన ఇమ్రాన్‌ హష్మీనే సన్నీలియోన్‌తో నటించనని చెప్పిన హీరో. ఓ సినిమాలో సన్నీలియోన్‌తో కలిసి నటించాల్సి రావడంతో, ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడట అతను.

కారణాలు అడగవద్దని, తనకు ఆమెతో సినిమా చేయడం ఇష్టం లేదని ఆ సినిమా నిర్మాతలకు, దర్శకుడికి స్పష్టంగా చెప్పాడట ఇమ్రాన్‌ హష్మి. ఓ సాంగ్‌తోపాటు, మూతి ముద్దుల సీన్‌ ఒకటి సన్నీలియోన్‌తో ఇమ్రాన్‌ హష్మీ చేయాల్సి ఉంది ఆ సినిమాలో. ‘నాతో లిప్‌ టు లిప్‌ కిస్‌ చేయడానికి హీరోయిన్లు పోటీ పడ్తారు’ అని చెప్పుకునే ఆ హీరో, సన్నీలియోన్‌తో ఎందుకు చేయనన్నాడో అర్థం కాలేదు బాలీవుడ్‌ సినీ జనాలకి.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam