Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

స‌న్నీలియోన్ పోర్న్ స్టార్ అని తెలీదు

interview with manchu manoj

బిందాస్‌, పోటుగాడు, క‌రెంటు తీగ‌.... ఈ టైటిళ్లు మంచు మ‌నోజ్‌కి క‌రెక్ట్‌గా స‌రిపోతాయ్‌.త‌న లైఫ్‌ని బిందాస్ గా గ‌డిపేస్తున్న బ్యాచిల‌ర్‌.. మనోజ్‌.త‌న సినిమాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాలు త‌నే డైరెక్ట్ చేసుకొంటూ, త‌న పాట‌లు తానే పాడుకొంటూ, త‌న పాట్లు తానే ప‌డే.. పోటుగాడు... మ‌నోజ్‌.ఎన‌ర్జీకి మారు పేరు.. ఒక్క మాట‌లో క‌రెంట్ తీగ‌!!

ఇప్పుడు ఈ టైటిల్‌తోనే జ‌నం ముందుకు రాబోతున్నాడు. మ‌నోజ్ సినిమా అంటే జ‌నానికి కాసింత న‌మ్మ‌కం. సినిమా ఎలాగున్నా, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొద‌వ రాద‌ని. మ‌నోజ్ కూడా అదే సూత్రంతో క‌థ‌లు అల్లుకొంటాడ‌ట‌. క‌రెంటు తీగ‌తో 100 % ఎంట‌ర్‌టైన్ చేస్తాన‌ని మాటిస్తున్నాడు. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా గో తెలుగుతో మ‌నోజ్ పంచుకొన్న క‌బుర్లు ఇవీ..

* క‌రెంటు తీగ - ముట్టుకొంటే షాకే అన్న‌మాట‌..
- (న‌వ్వుతూ) ముట్టుకొంటే కాదు... చూస్తే అని మార్చుకోవాలి. లేదంటే నెగిటీవ్ మీనింగ్ వ‌చ్చేస్తుంది.

* ఇంతకీ సినిమా పూర్త‌య్యాక మీరు చూశారా?
- ఓ... చాలా బాగా వ‌చ్చింది. నా సినిమాల్లోకెల్లా ది బెస్ట్‌. ఇది గ్యారెంటీ.

* ఈ సినిమా నుంచీ ముందు నుంచీ ఇదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కార‌ణ‌మేంటి?
- బేసిగ్గా ఇదో రీమేక్‌. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌య్యింది. మార్పులు చేర్పులూ చేసుకొంటే తెలుగులో మినిమం గ్యారెంటీ సినిమా అవుతుంద‌న్న న‌మ్మకం ముందు నుంచీ ఉంది. ఆ మార్పులు ఈ సినిమాలో బాగా కుదిరాయి.

* ముందు నుంచీ మినిమ‌మ్ గ్యారెంటీ సినిమాలే చేస్తూ వ‌చ్చారు...
- ఔనండీ. సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత‌ల‌కు న‌ష్టం రాకూడ‌ద‌న్న సిద్ధాంతం నాది. ఒక ఫ్లాప్ సినిమా త‌ర‌వాత కూడా నాకు ఓపెనింగ్స్ బెంగ ఉండ‌దు. ఊ కొడ‌తారా ఉలిక్కిప‌డ‌తారా నాకు అతి పెద్ద డిజాస్ట‌ర్‌. కానీ ఆ త‌ర‌వాత వ‌చ్చిన పోటుగాడు మంచి వ‌సూళ్లు సాధించింది.

* ఓ  సినిమా ఎంచుకొనేట‌ప్పుడు ఎలాంటి విష‌యాలు దృష్టిలో ఉంచుకొంటారు?
- నా ఏ రెండు సినిమాలు తీసుకొన్నా ఒక‌లా ఉండ‌కూడ‌దు. ఏదో ఓ డిఫ‌రెంట్ క‌నిపించాలి. ముందు నుంచీ అలానే జ‌ర్నీ చేస్తున్నా. న‌న్ను ఏ పాత్ర‌లో అయినా ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకొంటార‌న్న న‌మ్మ‌కం నాకుంది.

* మోహ‌న్‌బాబు గారికి అసెంబ్లీ రౌడీ, పెద రాయుడు లాంటి మైల్‌స్టోన్ సినిమాలున్నాయి. అలాంటి సినిమా మీ ఖాతాలో లేవ‌న్న అసంతృఫ్తి ఉందా..?
- నా రేంజ్‌కి పోటుగాడు, బిందాస్‌, ప్ర‌యాణం స‌రిపోతాయ్ అండీ. ముందే చెప్పిన‌ట్టు నిర్మాత‌ల్ని సేఫ్ చేయ‌డం నా ప్ర‌ధాన ల‌క్ష్యం. నాతో సినిమా చేసిన ఏ నిర్మాతా న‌ష్ట‌పోకూడ‌దు.

*  ఇంత‌కీ స‌న్నీలియోన్ గురించి చెప్ప‌లేనేదు..
- అయ్యో... ఆమె ఈ సినిమాకి సూప‌ర్ ఎట్రాక్ష‌న్‌. తెర‌పై స‌న్నీ వ‌స్తే.. మేమెవ్వ‌రం ఆనం..

* ఆమె కోస‌మే ప్ర‌త్యేక గీతం జోడించారా?
- మాతృక‌లో అలాంటి పాటేం లేదండీ. తెలుగులో మాత్రం ఓ మ‌సాలా గీతం ఉండాల్సిందే అని ముందు నుంచీ అనుకొంటున్నాం. స‌న్నీ అని కాదు.. ఆ పాత్ర ఎవ‌రు చేసినా.. ఐటెమ్ గీతం పెట్టేవాళ్లం.

* సన్నీ ఓ పోర్న్ స్టార్‌.. మ‌రి ఇంట్లో అభ్యంత‌రం చెప్పలేదా?
- అన్న‌య్య వైపు నుంచి ఎలాంటి అభ్యంత‌రాలూ లేవు. నాన్న‌కైతే స‌న్నీ ఓ పోర్న్ స్టార్ అన్న సంగ‌తి తెలీదు. `ముంబై నుంచి ఓ అమ్మాయొచ్చింది, చాలా ప‌ద్ధ‌తిగా న‌టిస్తోంది` అనుకొంటున్నారు. ఓ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి ఓ పోర్న్ స్టార్ అని ఆయ‌న‌కీ తెలిసిపోయింది. అయినా నాన్న‌గారేం అన‌లేదు. చాలామంది దొంగ‌చాటుగా చేసేప‌ని, తాను కాస్త ప‌బ్లిక్‌గా చేసిందంతే.

* ఈ సినిమాని 25 దేశాల్లో విడుద‌ల చేస్తున్నారు. స‌న్నీ క్రేజ్‌ని క్యాష్ చేసుకొందామ‌నా?
- అదేం లేదండీ. మార్కెట్ ఎప్ప‌టిక‌ప్పుడు విస్ర్కృత ప‌ర‌చుకొంటూ వెళ్తే మంచిదే క‌దా..?  కరెంటు తీగ‌తో మిగిలిన 24 దేశాల్లో నాకు మార్కెట్ పెరిగిపోతుంద‌ని కాదు. రేప‌టి రోజుల‌కు ఇదో పునాదిగా ఏర్ప‌డుతుంద‌ని. అంతే.

* యువ హీరోల మ‌ధ్య పోటీ ఎలా ఉంది?
- మా మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉంది. ఒక‌రి సినిమాలు మ‌రొక‌రు చూస్తుంటాం. అభినంద‌న‌లు చెప్పుకొంటాం. కొత్త‌వాళ్లు మ‌రింత‌మంది రావాలి. టాలెంట్ ఉన్న‌వాళ్ల‌కు ఇక్క‌డ అవ‌కాశాలు దొరుకుతున్నాయి. మ‌రింత మంది టాలెంటెడ్ హీరోలు ప‌రిశ్ర‌మ‌కు రావాలి.

* వేదం త‌ర‌వాత మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు మ‌రిన్ని పెరిగాయి..
- అవును. ఆ ట్రెండ్ మొద‌లెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచి క‌థ‌లొస్తే నేను కూడా మ‌రో స్టార్‌తో క‌ల‌సి న‌టించ‌డానికి రెడీ.
విల‌న్ పాత్ర చేయ‌డానికి సిద్ధ‌మ‌ని చాలాసార్లు చెప్పా. ఇప్పుడు అందుకు సంబంధించి ఓ క‌థ సిద్ధం చేస్తున్నాం. త్వ‌ర‌లోనే వివ‌రాలు చెబుతా.

* మీ బ‌లం..
- ఎన‌ర్జీ. న‌న్ను అల‌సిపోయేలా చేయ‌డం అంత సుల‌భ‌మైన ప‌ని కాదు. నా పాత్ర‌తో పాటు ట్రావెల్ చేస్తుంటా. పాత్ర స్వ‌భావాన్ని బాగా అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తా.

* డ్రీమ్‌
- ప్ర‌తి సినిమా క‌ల‌ల సినిమానే. ప్రాణం పెట్టి ప‌నిచేస్తా.

* ఇంత‌కీ పెళ్లెప్పుడు...?
- అంతా ఇదే మాట అడుగుతున్నారు. చూద్దాం.. ఆ గంట ఎప్పుడు మోగుతుందో...??

* త‌రువాతి సినిమా?
- బ‌య‌టి బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నా. క‌రెంటు తీగ రిలీజ్ త‌ర‌వాత ఆ ప్రాజెక్టు గురించి చెబుతా.

-కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Current Theega