Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
depression

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( నవంబర్ 7 నుండి నవంబర్ 13 వరకు) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. చేపట్టు పనుల విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. నూతన ప్రయత్నాలలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. సమయానుకూలంగా వ్యవహరించుట వలన చాలావరకు సమస్యలు తొలగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. కుటుంబంలో సభ్యుల వద్ద నుండి అధికంగా ఆశించుట భంగపాటే అవుతుంది కావున ఇచ్చిపుచ్చుకొనే దొరని తప్పక మేలుచేస్తుంది. ప్రయాణాల విషయంలో కొంత విముకతను చూపించే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు మిమ్మల్ని కొంత నూతన విధనాల వైపుకు మొగ్గుచూపించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం స్వల్ప జాగ్రత్తలు తీసుకోండి.

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాల అన్వేషణ మొదలుపెడతారు. ఉద్యోగంలో అధికారులతో చర్చల్లో పాల్గొంటారు అదేవిధంగా వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయలను తెలుసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వాటికి సమయాన్ని ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి ముందుకు వెళ్ళండి.    

 

మిథున రాశి
ఈ వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు కాస్త సమయం ఇస్తారు. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టే కన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది అలాగే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులవద్దనుండి మీరు ఆశించిన వార్తలను తెలుస్కోనే అవకాశం ఉంది కొంత సంతృప్తికరమైన ఫలితాలు  ఊరట. కుటుంబంలో చర్చలకు అవకాశం ఇవ్వకపోవడం అనేది తెలివైన పని జాగ్రత్త.
 

కర్కాటక రాశి
ఈ వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. ఇష్టమైన పనుల పట్ల మక్కువను చూపిస్తారు అలాగే విందులలో పాల్గొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్న ఊహించని ఖర్చులకు అవకాశం కలదు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు అధికారులతో వారికి అనుగుణంగా నడుచుకోవడం మూలాన చక్కటి గుర్తిపు లభిస్తుంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. కుటుంబంలో బంధువుల నుండి నూతన చర్చలకు అవకాశం ఉంది వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవడం అనేది ఉత్తమం
 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులకు సమయాన్ని కేటాయిస్తారు వాటిని విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలకు అవకాశం ఉంది అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళడం మూలాన మరింత అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు స్వల్పజాగ్రత్తలు అలాగే ముందుచూపు అవసరం. కుటుంబసభ్యుల ఆలోచనల మూలాన అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. అనుభవజ్ఞులతో కలిసి చేసే పనుల్లో మీ ఆలోచనలకు వారినుండి సహకారం లభిస్తుంది.

 

కన్యా రాశి
ఈ వారం మొత్తంమీద చేసే పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట అనేది సూచన. తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వకండి నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో రాక,పొక అలాగే ఉంటుంది కాబట్టి కంగారుపడకండి బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన నూతన పరిచయాలకు అవకాశం కలదు. అనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే సమయానికి భోజనం చేయుట మంచిది. బంధుమిత్రుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు వారితో కలిసి శుభకార్యముల విషయంలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.  

తులా రాశి
.......ఈ వారం మొత్తంమీద చాలావిషయంలో ముందుచూపుతో ముందుకు వెళ్ళండి మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బద్ధకం వీడి శ్రమను పొందుట వలన సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో అశ్రద్ద వద్దు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించుట అనేది సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ అలాగే ఒత్తిడి ఉంటుంది కావున సమయపాలన అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద నలుగురిలో మీయొక్క ఆలోచనల మూలాన మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అతిఉత్సాహం మూలాన చిన్న చిన్న పొరపాట్లు చేయడం మూలన ఇబ్బందులకు లోనవుతారు జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు చేతిదాటి పోవుటకు అవకాశం కలదు కావున ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయకండి వీలయితే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చు సూచనల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో అలాగే తోటివారితో కలిసి పనిచేసే ప్రయత్నం మంచిది.

ధనస్సు రాశి
ఈ వారం మొత్తంమీద అనుకూలమైన ఫలితాలు రావడం వలన చాలావరకు ఊరట చెందుతారు. అధికారుల మూలాన శ్రమను అలాగే పనిభారం పొందుతారు కాకపోతే వారినుండి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది సంతోషాన్ని పొందుతారు. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది నలుగురి ఆలోచనలు వినే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు ఆ పనులను ఇతరులకుఅప్పజెప్పె అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎప్పటిలాగే ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. వాహనముల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది.

మకర రాశి

ఈ వారం మొత్తంమీద ఒకవార్త మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. పెద్దల సహకారం ఉండుట వలన వాటిని ఎదుర్కొనే అవకాశం కలదు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల సహకారం లభించుట అనేది కొంత మంచి పరిణామం వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది ఇబ్బందులు తొలగిపోతవి. దూరప్రదేశం నుండి నూతన భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం తొందరపాటు వద్దు నిదానంగా వ్యవహరించుట సూచన.

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో మార్పుల కోసం మీరు చేయుప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరమైన విషయాలకు సమయం ఇస్తారు అలాగే పెట్టుబడులకు అవకాశం ఉంది మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇవ్వడం మంచిది. సామాజిక సేవాకార్యక్రమాలకు సమయం ఇస్తారు నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు.

మీన రాశి
ఈ వారం మొత్తంమీద నచ్చిన పనులకు సమయం ఇస్తారు వాటి మూలాన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊరట పొందుతారు. చేపట్టిన పనులను నలుగురి సహాయంతో విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి ప్రణాళిక అవసరం. చాలవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన మాటను పడవలసి రావోచ్చును కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబసభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుండి వచ్చు సూచనలు మేలుచేస్తాయి. సంతానపరమైన విషయాల్లో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Heel Pain | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)