Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sandeep kishan

ఈ సంచికలో >> సినిమా >>

జోరు చిత్ర సమీక్ష

joru movie review

చిత్రం: జోరు
తారాగణం: సందీప్‌ కిషన్‌, రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్‌, బ్రహ్మానందం, షయాజీ షిండే, సప్తగిరి, అజయ్‌, తదితరులు
చాయాగ్రహణం: పళణికుమార్‌
సంగీతం: భీమ్స్‌
నిర్మాణం: శ్రీ కీర్తి ఫిలింస్‌
దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర
నిర్మాతలు: అశోక్‌, నాగార్జున్‌
విడుదల తేదీ: 7 నవంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
తల్లి దండ్రులమీద అలిగి హైద్రాబాద్‌కి పయనమవుతాడు సందీప్‌ (సందీప్‌ కిషన్‌). దార్లో, చాన్నాళ్ళ తర్వాత విదేశాల నుంచి ఇండియాకి తిరిగొస్తున్న అను (రాశి ఖన్నా)తో సందీప్‌కి పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోనే అనుతో సందీప్‌ ప్రేమలో పడ్తాడు. అయితే అను మీద కొందరు దాడి చేస్తారు. ఆ దాడి వెనుక తన తండ్రి కాని తండ్రి ఎమ్మెల్యే సదాశివం (షయాజీ షిండే) కొడుకు హస్తం వుందని అను తెలుసుకుంటుంది. విషయం తెలుసుకున్న సందీప్‌, సదాశివం నుండి అనుని కాపాడి, ఆమెనెలా దక్కించుకుంటాడన్నది తెరపై చూడాల్సిన మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే
సందీప్‌ కిషన్‌ మంచి నటుడు. చేసిన ప్రతి సినిమాలోనూ నటుడిగా వేరియేషన్స్‌ చూపడంలో సఫలమవుతున్నాడు. ఈసారి రొటీన్‌ కమర్షియల్‌ సినిమాని ఎంచుకున్న సందీప్‌ కిషన్‌, వెరైటీ ఆశించొద్దని ముందే చెప్పాడు. కమర్షియల్‌ సినిమాకి తగ్గట్టుగా వుంది అతని నటన. కామెడీ పండించగలిగాడు. యాక్షన్‌లో రాణించాడు. తన పాత్ర వరకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్‌ రాశి ఖన్నా క్యూట్‌గా కనిపించింది. కొంచెం హాట్‌ హాట్‌గానూ తెరపై గ్లామర్‌ పండిరచింది.

మిగతా హీరోయిన్లు సుష్మా రాజ్‌, ప్రియా బెనర్జీ ఇద్దరూ ఓ పాటలో హాట్‌ హాట్‌గా అందాల విందు చేశారు. బ్రహ్మానందం పాత్ర కామెడీ పండించడంలో ఫర్వాలేదనిపించింది. బ్రహ్మానందంని పూర్తిగా వాడుకున్నాం అని చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ సందర్భంగా చెప్పిందిగానీ, ఆ వాడకం సినిమాకి ప్లస్‌ అవలేదు. షయాజీ షిండే రొటీన్‌. మిగిలిన పాత్రధారులంతా ఓకే అన్పిస్తారు. సప్తగిరి ఎలుగుబంటితో కామెడీ పండించేందుకు ప్రయత్నించాడు. సీన్‌ లెంగ్త్‌ ఇంకొంచెం తక్కువైతే బావుండేది.

రెండు పాటలు బాగున్నాయి. ‘జోరు’ టైటిల్‌ సాంగ్‌ ప్రమోషన్‌కి బాగా హెల్ప్‌ అవగా, తెరపై రెండు పాటలు అందంగా వున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌ పేరుతో కొన్ని అనవసరపు శబ్దాలు ఎక్కువగా ఉపయోగించారు. పళనికుమార్‌ సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాకి రిచ్‌ లుక్‌ తెచ్చింది. నిర్మాణ పరంగా చూస్తే, సినిమా చాలా రిచ్‌గా ఉందంటే నిర్మాణంలో రాజీ పడకపోవడమే కారణం. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ ఓకే. స్క్రీన్‌ప్లే ఫర్వాలేదు. ట్విస్ట్‌లు చాలా వున్నాయి. సినిమాని వేగంగా, ఎంటర్‌టైనింగ్‌గా నడిపించడంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. ఎడిటింగ్‌ ఇంకా బాగా పని చేయాల్సి వుంది.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా, కొంచెం రొమాంటిక్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగానే వుంది. సెకెండాఫ్‌లో మెలోడ్రామా, కన్‌ఫ్యూజన్‌ కొంచెం ఎక్కువయ్యాయి. దర్శకుడి తడబాటు సెకెండాఫ్‌లో ఎక్కువగానే కనిపించింది. ఓవరాల్‌గా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది తప్పితే, ప్రచారంలో వున్న స్పీడ్‌, సినిమాలో లేదు. జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అని వచ్చేవారిని సినిమా నిరాశపర్చదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని, సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా మలిచి వుంటే, కామెడీ విషయంలో ఇంకా జాత్త్ర తీసుకుంటే సినిమా కమర్షియల్‌గా బెటర్‌ ప్రాజెక్ట్‌ అయ్యేది.

ఒక్క మాటలో చెప్పాలంటే

టైటిల్‌లో వున్న జోరు సినిమాలో అంతగా లేదు
అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
joined in mega power legue