Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
joru movie review

ఈ సంచికలో >> సినిమా >>

‘మెగా పవర్‌ లీగ్‌’లో చేరాడు

joined in mega power legue

మెగా కుటుంబం నుంచి వస్తున్న సాయి ధరమ్‌ తేజ, మెగాపవర్‌ లీగ్‌లో చేరాడు తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే. పెద మావయ్య సెంటిమెంట్‌ని పుణికి పుచ్చుకున్న ధరమ్‌ తేజ తొలి సినిమా విడుదల కాలేదుగాని, రెండో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘అచ్చం నాలాగానే సాయిధరమ్‌ తేజ కూడా..’ అని చిరంజీవి కూడా గతాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి నటించిన తొలి సినిమాకన్నా రెండో సినిమా ముందు విడుదలయ్యింది. ఆ విషయం అందరికీ తెలుసు.

సాయిధరమ్‌తేజ విషయంలోకి వచ్చినట్లయితే డాన్స్‌ల్లో ఈజ్‌ వరకూ పెదమావయ్య, చినమావయ్యలను మించిపోయేలా కనిపిస్తున్నాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ట్రైలర్‌లో అతని కాన్ఫిడెన్స్‌ కనిపించింది అందరికీ. ఆ ఈజ్‌ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ క్యాచ్‌ చేసినట్టున్నాడు. అందుకే తన సినిమాలో సాయిధరమ్‌ను హీరోగా ఫిక్స్‌ చేసుకున్నాడు హరీష్‌ శంకర్‌. సూపర్‌ ప్రొడ్యూసర్‌ ‘దిల్‌’ రాజు ఈ కాంబినేషన్‌కి అదనపు బలంగా మారారు.

‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో దిల్‌ రాజు, సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో రెజినా హీరోయిన్‌. తొలి సినిమా విడుదల కాకుండా, రెండో చిత్రం విడుదలకు సిద్ధమవడం, మూడో సినిమాకి స్టార్‌ డైరెక్టర్‌, స్టార్‌ ప్రొడ్యూసర్‌తో చేస్తున్న సాయిధరమ్‌, మెగా పవర్‌ లీగ్‌లో చేరిపోయాడు. మెగా ఫ్యామిలీ రేంజ్‌కి తగ్గ హీరోల్లో తానూ ఒకడినని అప్పుడే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేశాడు సాయిధరమ్‌. ఆల్‌ ది బెస్ట్‌.

మరిన్ని సినిమా కబుర్లు
srinu with srinu mass movie again