Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
joined in mega power legue

ఈ సంచికలో >> సినిమా >>

శీను విత్‌ శీను మళ్ళీ మాస్‌ సినిమానే

srinu with srinu mass movie again

హీరోగా లాంఛ్‌ అవుతూనే భారీ ప్రాజెక్ట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. ‘అల్లుడు శీను’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కుర్రాడు ఫస్ట్‌ సినిమాతో సూపర్బ్‌ అనిపించుకున్నాడు. కుమారుడిని లాంఛ్‌ చేయడం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని బెల్లంకొండ సురేష్‌, తన ప్రయత్నంలో విజయమే సాధించారు.

తొలి సినిమానే గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌, రెండో సినిమాకీ అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. రెండోదీ మాస్‌ సినిమానే చేస్తున్నాడీ కుర్రాడు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. బాడీ లాంగ్వేజ్‌లో మార్పులు చేస్తున్నామనీ, దానికి హీరో ప్రిపేర్‌ అవుతున్నాడని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పాడు. తొలి సినిమాని మించి రెండో సినిమా విజయం సాధిస్తుందని బోయపాటి శ్రీనుతో చేస్తున్న ప్రాజెక్ట్‌పై ధీమా వ్యక్తం చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్‌.

ఓ టాప్‌ హీరోయిన్‌ బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన నటించనున్న ఈ సినిమాకి సంగీతం దగ్గర్నుంచి, టెక్నికల్‌గా ప్రతి విభాగం రిచ్‌గా వుండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారట. సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు కొన్ని రోజుల్లో తెలియనున్నాయి.
 

మరిన్ని సినిమా కబుర్లు
trisha increasing speed