Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srinu with srinu mass movie again

ఈ సంచికలో >> సినిమా >>

స్పీడు పెంచుతున్న త్రిష

trisha increasing speed

హీరోయిన్‌ త్రిష మళ్ళీ స్పీడు పెంచుతున్నది. తెలుగులోనూ, తమిళ సినిమాల్లోనూ త్రిష స్టార్‌ హీరోయిన్‌గానే గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, నాగార్జున వంటి అగ్రహీరోలతోనూ, ప్రభాస్‌, మహేస్‌ వంటి యంగ్‌ జనరేషన్‌ హీరోలతోనూ నటించిన పలు విజయాల్ని నమోదు చేసిన త్రిష, తమిళంలో కూడా టాప్‌ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో కూడా ట్రై చేసినప్పటికినీ అక్కడామెకు సక్సెస్‌ దొరకలేదు.

సీనియర్‌ హీరోయిన్‌ అన్న గుర్తింపు వచ్చేసరికి ఆమెకు సినిమాలు తగ్గాయి. తెలుగు, తమిళంలోనూ ఇదే పరిస్థితి. త్రిష కెరీర్‌ అయిపోయిందని అందరూ అనుకుంటుండగా, కన్నడలో ఆమె నటించిన ‘పవర్‌’ సినిమా పెద్ద విజయం సాధించింది. దాంతో త్రిష మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తమిళం నుంచీ, తెలుగు నుంచి కూడా త్రిషకు ఆఫర్లు వస్తున్నాయట.

కెరీర్‌ ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారీ తనకు ఓ లైఫ్‌ దొరుకుతుందనీ, కొత్త ఇన్నింగ్స్‌ ఇంకా గొప్పగా ఉంటుందని త్రిష చెప్పింది. సినిమా అంటే నాకిష్టం, సినిమాని ఎప్పటికీ వదలను అని ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి చెప్పిన త్రిష, తెలుగులోనూ, తమిళంలోనూ కొన్ని ప్రాజెక్ట్స్‌ డిస్కషన్‌లో వున్నాయని వెల్లడిరచింది. సినిమాలే కాకుండా కొన్ని సంస్థలు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆఫర్స్‌తో త్రిష వెంట పడ్తున్నారట

మరిన్ని సినిమా కబుర్లు
daring and dashing