Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
trisha increasing speed

ఈ సంచికలో >> సినిమా >>

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌

daring and dashing

వ్యభిచారం కేసులో ఓ హీరోయిన్‌ అరెస్ట్‌ అయ్యిందంటే, ఆమె కెరీర్‌ ఇక ముగిసిపోయినట్టే. చిన్న చిన్న పాత్రలు చేసుకోవడమో, లేదంటే కెరీర్‌ నుంచి తప్పుకోవడమో చేయాల్సి వస్తుంది. కాని చేయని తప్పుకు శిక్ష అనుభవించానని భావిస్తున్న ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్‌ శ్వేతా బసు ప్రసాద్‌, తాను తప్పు చేయలేదని ఘంటాపధంగా చెబుతుంది.

‘ఎవరో ఏదో అనుకుంటే అది వారి ఖర్మ..’ అని నిర్మొహమాటంగా చెబుతూ, తన టాలెంట్‌ని చూసి అవకాశాలు ఇస్తే సినిమాల్లో నటిస్తాననీ, అంతే తప్ప తన మీద జాలితో అవకాశాలు చూపిస్తే చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేసింది. తనది ఉన్నత విలువలు గల కుటుంబం అని, తానెలాంటి తప్పు ఎప్పటికీ చేయబోనని కెరీర్‌లో ఇంకా ఎదగగలనన్న నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తం చేసింది శ్వేతా బసు ప్రసాద్‌.

తప్పుడు కేసులో ఇరుక్కుని, రెస్క్యూ హోమ్‌లో గడిపిన తాను కొంచెం ఆందోళన చెందినప్పటికీ, అక్కడున్న చిన్న పిల్లలకు పాఠాలు చెబుతూ, సంగీతం నేర్పుతూ, సమాజానికి మంచి చేసే విషయాలను వారికి తెలియజెప్పి ‘సేవ’ చేశానని శ్వేత గర్వంగా చెబుతుంది. మొదటి నుంచీ ఆమె డేరింగ్‌ బ్యూటీనే. అందుకే సినిమా అవకాశాలూ ఆమెకు తొందరగా రాలేదని అంటారు.
 

మరిన్ని సినిమా కబుర్లు
find to nudity as a art