Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
coming glamorous ramya

ఈ సంచికలో >> సినిమా >>

మిర్చిలాంటి కుర్రాడే

boy like mirchi

అభిజిత్‌ అంటే గుర్తు పట్టడం కష్టంగానీ, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలోని మిర్చిలాంటి కుర్రాడంటే చాలామందికి తెలుసు. అతనే అభిజిత్‌. సోలో హీరోగా ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు అభిజిత్‌. ఫస్ట్‌ సినిమాలో క్యూట్‌ క్యూట్‌గా కనిపించాడుగానీ, ఇప్పుడైతే విలన్లను చెడుగుడు ఆడే పవర్‌ఫుల్‌ హీరోగా మారిపోయాడు.

‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమా కోసం కండలు తిరిగిన శరీరాన్ని పొందిన అభిజిత్‌, ఈ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని ప్రదర్శించబోతున్నాడంట. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకకు బాలకృష్ణ హాజరై, చిత్ర యూనిట్‌కి బెస్ట్‌ విషెస్‌ అందజేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

హీరో అభిజిత్‌ విషయానికొస్తే, కెరీర్‌లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటాడట ఈ యంగ్‌ హీరో. లవర్‌ బాయ్‌గానూ, యాక్షన్‌ హీరోగానూ పేరు తెచ్చుకోవాలని వుందంటున్నాడు అభిజిత్‌. ‘మిర్చి లాంటి కుర్రాడు’గా వస్తున్న యంగ్‌ హీరో అభిజిత్‌కి బెస్టాఫ్‌ లక్‌ చెప్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
rain sentiment for varun