Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
boy like mirchi

ఈ సంచికలో >> సినిమా >>

వరుణ్‌కి వర్షం సెంటిమెంట్‌

rain sentiment for varun

వానపాట వుంటే సినిమా హిట్టే అని ఒకప్పుడు సెంటిమెంట్‌గా ఫీలయ్యేవారు. తెలుగు సినిమాల్లో చాలా వాన పాటలు హిట్‌ అయ్యాయి. వాన పాటలున్న చాలా సినిమాలూ సంచలన విజయాలు సాధించాయి. ‘వర్షం’ పేరుతో ప్రభాస్‌, త్రిష జంటగా వచ్చిన సినిమా కూడా పెద్ద హిట్‌. అలా వర్షం తనకూ కలిసొస్తుందని యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ నమ్మకంతో ఉన్నాడు.

వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటిస్తున్న ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో హరిప్రియ హీరోయిన్‌. రమణ మొగిలి చిత్ర దర్శకుడు. ఈ మధ్యకాలంలో తాను చేసిన సినిమాల్లోకెల్లా డిఫరెంట్‌ ఫిలిం ‘ఈ వర్షం సాక్షిగా’ అని చెప్పిన వరుణ్‌, సినిమా ఘనవిజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలనని అంటున్నాడు.

ఒకప్పుడు సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా స్పీడ్‌ స్పీడ్‌గా సినిమాలు చేశాడు వరుణ్‌ సందేశ్‌. అయితే ఇప్పుడతని ఆలోచనల్లో మార్పు వచ్చినట్లుగా కన్పిస్తోంది. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అదలా ఉంచితే, కొన్ని కారణాల వల్ల ఎప్పుడో పూర్తయి, ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఈ వర్షం సాక్షిగా’ ఆలస్యంగా వస్తున్నా, ట్రెండీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు, నిర్మాత, హీరో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్‌ ఆశిస్తున్న వర్షం సెంటిమెంట్‌ నిజమయ్యి, ‘ఈ వర్షం సాక్షిగా’ హిట్‌ అయితే, అతని కెరీర్‌ దూసుకుపోవడం ఖాయం.

మరిన్ని సినిమా కబుర్లు
must say dancing sensation