Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
must say dancing sensation

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ సినిమా ఎప్పుడు?

when is mega star movie

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుంచి కొత్తకొత్తగా హీరోలు వస్తున్నారు. కానీ మెగాస్టార్‌ నటించే సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో తెలియక అభిమానుల్లో ఆవేదన పెరుగుతుంది. రాజకీయ రంగ ప్రవేశంతో చిరంజీవి సినిమాల్ని వదులుకున్నారు. సినిమాల్లో మళ్ళీ నటిస్తానని చిరంజీవి వీలు చిక్కినప్పుడల్లా చెప్పడం తప్పితే, ఆయన హీరోగా నటించే సినిమా సెట్స్‌పైకి రావడంలేదు.

వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయాలనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్‌ కుదరలేదని సమాచారం అందుతుంది. పలువురు దర్శకుల ద్వారా చిరంజీవి కథల్ని వింటున్నారట. సినిమా చేయాలనే ఆలోచనతోనే చిరంజీవి వున్నప్పటికీ, ఎలాంటి సినిమాతో రీ`ఎంట్రీ ఇవ్వాలో చిరంజీవి తేల్చుకోలేకపోతుండడం వల్ల ఆయన నటించాల్సిన సినిమా ఆలస్యమవుతున్నట్లు సమాచారమ్‌.

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ, అభిమానులకు చిరంజీవి సినిమా ఇచ్చే కిక్‌ ఇంకే సినిమా ఇవ్వదేమో. ఈ ఏడాదిలోనే ఖచ్చితంగా సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను అని 2014 మొదట్లో చెప్పిన చిరంజీవి, ఈ ఏడాది దాటిపోతున్నప్పటికీ, ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ చేయలేకపోవడంతో 2015లో అయినా చిరంజీవి ప్రేక్షకుల ముందుకొస్తారో లేదో తెలియకపోవడం అభిమానులకు మింగుడుపడని అంశమే. తెరపై మెగాస్టార్‌ డాన్సులు, ఫైట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చూడాలని ఆశిస్తున్న అభిమానుల కోరిక చిరంజీవి ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam