Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
changing heroines as item girls- dasari

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష : పిల్లా నువ్వు లేని జీవితం

Movie Review - Pilla Nuvvu Leni Jeevitham

చిత్రం: పిల్లా నువ్వు లేని జీవితం
తారాగణం: సాయి ధరమ్‌ తేజ, రెజినా, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, షిండే, చంద్రమోహన్‌, రఘుబాబు, ఆహుతి ప్రసాద్‌ తదితరులు.
చాయాగ్రహణం: దాశరధి శివేంద్ర
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: గీతా ఆర్ట్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
దర్శకత్వం: ఏ.ఎస్. రవికుమార్ చౌదరి
నిర్మాతలు: బన్నీ వాస్‌, శ్రీహర్షిత్‌
విడుదల తేదీ: 13 నవంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
సరదా సరదాగా తిరిగే ఓ కుర్రాడు శ్రీను (సాయి ధరమ్‌ తేజ్‌), తనను చంపేయమని రౌడీ షీటర్‌ మైసమ్మ (జగపతిబాబు) వద్దకు వెళ్తాడు. తాను చచ్చిపోవాలనుకోవడానికి కారణం ప్రేమలో విఫలమవడమేనని మైసమ్మతో శ్రీను చెబుతాడు. తను ప్రేమించిన శైలజ (రెజినా) తనకు దక్కనప్పుడు చావే తనకు శరణ్యం అంటాడు శ్రీను. అయితే మైసమ్మ శైలజను చంపాలనుకుంటాడు. ఈ క్రమంలో శైలజ విషయంలో మైసమ్మ, శ్రీను ఒకర్ని ఒకరు ఛాలెంజ్‌ చేసుకుంటారు. ప్రేమ దక్కలేదని శ్రీను తనువు చాలిస్తాడా? ప్రేమను గెలిపించుకుంటాడా? మైసమ్మ ఎందుకు శైలజను చంపాలనుకుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే:
తొలి సినిమా ‘రేయ్‌’ విడుదల కాకుండానే రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సాయిధరమ్‌ తేజ. నటనలో ఈజ్‌ కనిపించింది. డాన్సుల్లో అయితే మెగాస్టార్‌ చిరంజీవిని తలపించాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ రాణించాడు. బాడీ లాంగ్వేజ్‌ పరంగానూ ఓకే. లుక్స్‌ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది అతనికి. రెజినా నటిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. సినిమాలో క్యూట్‌గా కనిపించింది. నటన పరంగానూ రాణించింది. విలన్‌గా ‘లెజెండ్‌’లో కనిపించిన జగపతిబాబు, ఈ సినిమాలోనూ విలనీ పండించాడు. డైనమిక్‌గా వున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో జగపతి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రగడ్‌ లుక్‌తో విలనిజం ప్రదర్శించడంలో తనదైన ముద్ర వేశాడు జగపతిబాబు. ప్రకాష్‌రాజ్‌  షరామామూలే. రఘుబాబు కామెడీ సినిమాకి అదనపు ఆకర్షణ. ప్రభాస్‌ శ్రీను కూడా నవ్వులు పూయించాడు. షయాజీ షిండే తదితరులంతా తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదన్పించారు.

ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ చేసిన వర్క్‌ బావుంది. సినిమా రిచ్‌గా రూపొందింది. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌ గ్లామర్‌ తీసుకొచ్చింది. పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. కథ రొటీన్‌ అయినా, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఆకట్టుకున్నాడు. డైలాగ్స్‌ కూడా బాగున్నాయి.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు రొమాన్స్‌, యాక్షన్‌ మిక్స్‌ అవడంతో ఫస్టాఫ్‌ అంతా సాఫీగానే సాగిపోతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బావుంది. సెకెండాఫ్‌లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవలేకపోయినా, అక్కడక్కడా జర్క్‌లు ఎదురవడంతో, ఇబ్బందికరంగా వుంటుంది. ఓవరాల్‌గా సినిమాకి యావరేజ్‌ టాక్‌ వస్తుంది. సినిమాకి చేసిన ప్రమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కమర్షియల్‌గా కలిసొచ్చే అంశాలు. కథ, ట్రీట్‌మెంట్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే ఇంకా మంచి రిజల్ట్‌ సాధ్యమయ్యేది.

ఒక్క మాటలో చెప్పాలంటే: మెగాస్టార్‌ మేనల్లుడి ఎంట్రీ జస్ట్‌ ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka