Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
i am romantic- ileyana

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌

super star is back

రజనీకాంత్‌ అంటే సూపర్‌ స్టార్‌. సూపర్‌ స్టార్‌ అంటే రజనీకాంత్‌. దటీజ్‌ రజనీ. ఆయన స్టైల్‌ సూపర్బ్‌. ఇక రజనీకాంత్‌ సినిమాల్లో నటించడేమో అని తెలిసే సరికి, అభిమానులు ఆందోళన చెందారు, కంటతడి పెట్టారు కూడాను. కానీ సూపర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌. గ్రాఫిక్స్‌ సినిమాతో కాదు, ‘లింగా’ అనే సినిమాతో. టీజర్‌తోనే రజనీకాంత్‌ తన ట్రేడ్‌ మార్క్‌ సెన్సేషన్‌ని క్రియేట్‌ చేశాడు.

తమిళంలో రూపొందిన ‘లింగా’ తెలుగుతోపాటు, ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. దాంతో అన్ని భాషల సినీ ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తి అమాంతం ఆకాశమెత్తున పెరిగిపోయింది. సూపర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అని తెలుగులో కూడా సినీ అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమా పట్ల బాలీవుడ్‌ సినీ వర్గాల వారూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

‘లింగా’ ఇండియన్‌ సినిమా రికార్డుల్ని బద్దలు గొడుతుందేమో అని హిందీ సినీ స్టార్స్‌ కూడా భావిస్తున్నార్ట. ఈ సినిమా వార్తలకు తెలుగులోనూ, హిందీలోనూ, కన్నడ, మలయాళంలోనూ క్రేజ్‌ పెరిగింది. అనారోగ్యంతో కొన్నాళ్ళు బాధపడ్డ రజనీకాంత్‌, పూర్తిగా కోలుకుని, చేసిన స్ట్రెయిట్‌ సినిమా (కొచాడియాన్‌లా గ్రాఫిక్స్‌ సినిమా కాదిది) ‘లింగా’ కావడంతో బయ్యర్లు, పోటీ పడ్తున్నారని సమాచారమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
both are special in dress appearence