Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Revenge - Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( నవంబర్28 నుండి డిసెంబర్ 4 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వార అధికారుల నుండి మంచి గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ధనమునకు సంభందించిన విషయాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. దైవసంభంద విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. కుటుంబంలో చేపట్టిన పనులను లేక నూతన ఆలోచనలకు సమయం ఇస్తారు. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్దిని కలుగజేస్తాయి. నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చుటకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి మీరు ఆశించిన విధంగా సహకారం అందుటకు ఆస్కారం కలదు. వివాదస్పదమైన వ్యక్తులకు దూరంగా ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది.  

 

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద పెద్దలతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో మొదట్లో కొంత ఇబ్బందులు కలిగినను చివరకు వాటిని విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. నూతన నిర్ణయాల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండే అవకాశం కలదు. కుటుంబసభ్యులతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. దూరప్రదేశ లేదా విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం కలదు ప్రయత్నం చేయుట ఉత్తమం. బంధువులనుండి నూతన సమాచారం సేకరిస్తారు అలాగే సంతానపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టుటకు అవకాశం కలదు.

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. వాహనముల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. బంధుమిత్రుల నుండి వచ్చు సూచనల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పెద్దలతో చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది అలాగే తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వకండి. నలుగురిలో పనిచేసే సమయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట వలన సమస్యలు తగ్గుతాయి. ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన చేపట్టిన నూతన పనులను అనుకున్న సమయానికి పూర్తీచేయుటకు అవకాశం కలదు. దైవసంభందపూజలకు సమయం ఇవ్వడం మంచిది.

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద సమాజంలో నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో కొంత ఇబ్బందులను అలాగే పనిఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది కావున సర్దుబాటు విధానం మంచిది. మీయొక్క ఆలోచనల్లో పరిపక్వత లేకపోతే నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వివాదములు ఏర్పడుటకు ఆస్కారం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట అనేది సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది వాటిని స్వాగతించుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామితో చర్చలు జరుపుతారు నిదానం అవసరం.  

 

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నలుగురిలో చేసిన ఆలోచనల మూలాన మంచి పేరును కలిగి ఉంటారు తోటివారికి సహాయం చేయుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. స్వల్పఅనారోగ్య సమస్యలు పొందుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో స్త్రీ / పరుష మూలక ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది నూతన నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం.   

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద చేసే పనుల విషయంలో స్పష్టత అవసరం. నలుగురిలో పనిచేసే సమయంలో అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఒకవార్త మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను దైర్యంగా ఎదుర్కొనే అవకాశం కలదు. విదేశీప్రయత్నాల విషయంలో ఒక స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రయత్నం పెంచుట మంచిది.

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో లేక వ్యాపారప్రయత్నాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం కలదు. ఆర్ధికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటిమూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. అనుకోని ఇబ్బందులు బంధువులు లేక కుటుంబసభ్యుల ద్వార పొందుటకు అవకాశం ఉంది. ఒకవార్త మిమ్మల్ని అసహనానికి గురిచేసే అవకాశం ఉంది. కుటుంబంలో స్వల్ప సర్దుబాటులకు అవకాశం ఉంది. మీయొక్క మాటతీరును కొంత మార్చుకోవడం మూలాన మరిన్ని మంచి ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. 

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద నూతన ఆలోచనలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులనుండి నూతన సమాచారం లభిస్తుంది వాటికి సమయం ఇచ్చే అవకాశం కలదు. విందులకు లేక సరదాగా గడిపే విషయలకు సమయం ఇచ్చే ఆవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు లేదా వాటివిషయంలో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం సంతృప్తికరమైన ఫలితాలను కలుగజేస్తాయి. ఒకవార్త మిమ్మల్ని ఒకింత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రుల సహకారంతో గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది ముందుకు వెళ్ళండి.  

 


ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద మీయొక్క ఆలోచనా సరళిని ఒకసారి సరిచుకోవాల్సి రావోచ్చును. అనవసరమైన వివాదములకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనుల్లో పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో వచ్చు మార్పులు మిమ్మల్ని కొంతమేర సంతోషాన్ని కలుగజేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి అవకాశం కలదు. ప్రయాణాలు చేయుట వలన కొంత చికాకును పొందుటకు ఆస్కారం కలదు. స్త్రీ / పురుష సమ్భ్నదమైన విషయాల వల్ల భాదను పొందుతారు కొంత నష్టపోయే అవకాష్మ కలదు జాగ్రత్త పెద్దల సూచనలు తీసుకోండి.    

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. రాజకీయపరమైన విషయల్లో పాల్గొనేవిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. మాటతీరు విషయంలో కొంత నిదానంగా వ్యవహరించుట సూచన తోటివారిని కొంత భాధకు గురిచేసే ఉండే అవకాశం ఉంది సరిచూసుకోండి. కుటుంబంలో సానుకూల నిర్ణయాలు తీసుకోని వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి మంచిది.  

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట సూచన. అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు కాకపోతే సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. కుటుంబంలో కీలకమైన విషయాల్లో నిర్ణయాలను వాయిదా వేసేప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇతరుల యొక్క ఆలోచనలు మిమ్మల్ని కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది కొంతమేర సర్దుకుపోవడం వలన మేలుజరుగుతుంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతాయి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది.    

 

 


మీన రాశి
ఈ వారం మొత్తంమీద బంధులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారితో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి అభినందనలు పొందుతారు కాకపోతే పనుల్లో శ్రమమాత్రం తప్పకపోవచ్చును. ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు కలుగుతాయి. కొన్ని కొన్ని విషయాల్లో మీయొక్క పరిదులను గుర్తించుకోవడం వలన మేలుజరుగుతుంది అలాగే ఇబ్బందులు తగ్గుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రులతో కలిసి చేపట్టిన పనుల్లో కొంత ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది ఇది మిమ్మల్ని సంతోషానికి గురిచేసే విషయం. కుటుంబంలో సభ్యుల నుండి మంచి సహకారం రావడం వలన సమయం సర్దుబాటు అవుతుంది. 
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Hepatitis B | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)