Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mehata offered movie to shweta

ఈ సంచికలో >> సినిమా >>

‘టెంపర్‌’లో ఎన్టీఆర్‌ స్టన్నింగ్‌ లుక్‌

NTR stunning look in temper

అల్లు అర్జున్‌ తెలుగులో సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌ని తీసుకొచ్చాడు. ప్రభాస్‌ సిక్స్‌ ప్యాక్‌ చూపలేదుగాని, ఆ స్థాయి కండలు లోలోపల అలానే ఉంచుకున్నాడతడు. కొందరు హీరోలు అవసరాన్ని బట్టి సిక్స్‌ ప్యాక్‌తో తెలుగు తెరపై సందడి చేస్తున్నారు, కొందరు అవసరం వస్తుంది కదా అని ముందే అ కండల్ని సంపాదించుకుని, అవి కరిగిపోకుండా ఎక్సర్‌సైజ్‌లు రెగ్యులర్‌గా కొనసాగిస్తున్నారు.

తెరపై బొద్దుగా మొదట్లో కనిపించి, షాకింగ్‌గా ‘యమదొంగ’తో సన్నబడ్డ ఎన్టీఆర్‌, ‘టెంపర్‌’ సినిమా కోసం కండలు మెలితిప్పాడు. ‘టెంపర్‌’ ఫస్ట్‌ లుక్‌ స్టన్నింగ్‌గా ఉంది. పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఒక్కసారిగా ‘టెంపర్‌’ లుక్‌తో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో హీట్‌ పుట్టించాడు ఎన్టీఆర్‌. ఇటీవల ఎన్టీఆర్‌ సినిమాలేవీ అంచనాల్ని అందుకోలేకపోతున్నాయి.

అలా రేసులో వెనకబడ్డ ఎన్టీఆర్‌, ‘టెంపర్‌’తో ఇండస్ట్రీ హిట్‌ కొడతాడని సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారంటే, ఆ సినిమాలో అతని లుక్‌ ప్రధాన కారణం. ‘టెంపర్‌’ ముందు ‘పోకిరి’ లాంటి సినిమాలు ఫ్లాప్‌ అనాల్సి వస్తుందని వర్మ ట్వీట్‌ చేసి ‘టెంపర్‌’పై అంచనాల్ని ఇంకా పెంచేశారు. ఆల్‌ ది బెస్ట్‌ యంగ్‌ టైగర్‌.

మరిన్ని సినిమా కబుర్లు
rajni is friend to my dad