Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR stunning look in temper

ఈ సంచికలో >> సినిమా >>

మా నాన్న ఫ్రెండ్‌ రజనీకాంత్‌

rajni is friend to my dad

శతృఘన్‌ సిన్హా, రజనీకాంత్‌ సినిమా కెరీర్‌లో ఇంచు మించు ఒకే ‘ట్రెండ్‌’కి చెందినవారు. హిందీలో శతృఘన్‌ సిన్హా రెబల్‌ స్టార్‌ అనిపించుకున్నారు. తమిళ సినిమాల్లో రజనీకాంత్‌ సూపర్‌స్టార్‌. రజనీకాంత్‌ కొన్ని హిందీ సినిమాలు కూడా చేశారు. అన్ని భాషల్లోనూ రజనీకాంత్‌కి ఫాలోయింగ్‌ ఉంది.

యంగ్‌ హీరోయిన్లతో ఇప్పటికీ సినిమాలు చేస్తూ, హిట్స్‌ కొడుతున్న ఘనత రజనీకాంత్‌కే దక్కుతుంది. తన స్నేహితుడి కుమార్తెను తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకున్నాడు రజనీకాంత్‌. ‘లింగా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సోనాక్షి, శతృఘన్‌ కుమార్తె. ‘మా నాన్న ఫ్రెండ్‌ రజనీకాంత్‌’ అని చెబుతూ, సీనియర్‌ యాక్టర్‌ అయినా, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారనీ, స్టార్‌నన్న గర్వం అతనిలో ఏమాత్రం తాను చూడలేదని సోనాక్షి ‘లింగా’ హీరో రజనీకాంత్‌పై పొగడ్తలు కురిపించింది. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే గుణం అందరికీ ఉండదు, అది రజనీకాంత్‌కే సొంతమని సోనాక్షి చెబుతుంది.

రజనీకాంత్‌ నటించిన ‘లింగా’ సినిమా గురించి యావత్‌ భారతదేశంలోని సినీ ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్‌ అంటేనే అంత. సోనాక్షి సిన్హా దక్షిణాదిలో నటిస్తోన్న తొలి సినిమా ఇదే.

మరిన్ని సినిమా కబుర్లు
harish decided subrahmanyam